desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Apr 12 2017 @ 12:44PM

ఇంటర్నెట్‌లో వైరల్ అయిన జయప్రద సాంగ్!

మూడున్నర దశాబ్దాల క్రితమే 'మవాలి'లో తన వయ్యారాలతో కుర్రకారును హీటెక్కించింది జయప్రద.. ఇప్పుడా గీతం మరో రూపంలో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
 
1980వ సంవత్సరంలో కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన 'చుట్టాలున్నారు జాగ్రత్త' కె. బాపయ్య దర్శకత్వంలో హిందీలో జితేంద్ర, జయప్రద హీరో హీరోయిన్స్‌గా 'మవాలి' పేరుతో రీమేక్ అయి ఘన విజయాన్ని సాధించింది. బప్పిలహరి సంగీతాన్నందించిన 'మవాలి'లో జితేంద్ర-జయప్రద రొమాంటిక్ సాంగ్.. 'ఓయి అమ్మ ఓయి అమ్మ..' బాగా పాపులరయ్యింది. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ సాంగ్.. ఇప్పుడు నయా టచ్‌తో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
 
విషయానికి వస్తే సియా ఫర్లర్ అనే ఆస్ర్టేలియన్ సింగర్.. 'దిస్ ఈజ్ యాక్టింగ్' అంటూ రూపొందించిన ఆల్బమ్‌లో.. చీప్ థ్రిల్స్ అనే పాట సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఈ గీతాన్నే ఇప్పుడు జయప్రద 'మవాలి' సాంగ్ వీడియోకి మిక్స్ చేసి రిలీజ్ చేశారు. ఎప్పుడో మూడున్నర దశాబ్దాల క్రితం వచ్చిన ఈ గీతం.. ఇప్పటి జెనరేషన్ మ్యూజిక్‌కు మ్యాచ్ అయి సోషల్ నెట్ వర్క్‌లో హల్ చల్ చేస్తుందన్నమాట. ఇందులో జయప్రద అందాలను చూస్తే ఈతరం హీరోయిన్లలో ఎవ్వరైనా ఈమె రేంజుకు సరిపోతారా అనిపించక మానదంటున్నారు.