Mar 29 2017 @ 02:35AM

39 మందికి ‘కళారత్న’

  • 89 మందికి ఉగాది పురస్కారాలు
  • నేడు విజయవాడలో బహూకరణ
అమరావతి: మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే ‘ఉగాది’ పురస్కార విజేతలను ప్రకటించింది. ఈసారి 39 మందికి కళారత్న, 89 మందికి ఉగాది పురస్కారాలను బుధవారం అందించనుంది. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ వివరాలు తెలిపారు. ‘‘ఉగాదిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నాం. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు’’ అని తెలిపారు. కళారత్న గ్రహీతలకు రూ.50 వేల నగదు, హంస ప్రతిమను.. ఉగాది పురస్కారం కింద రూ.10,116 నగదు, తెలుగు తల్లి ప్రతిమను అందిస్తామని చెప్పారు. ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించే ‘నవ్య’ వారపత్రిక సంపాదకుడు ఎ.ఎన్‌.జగన్నాథశర్మకు ‘కళారత్న’ లభించింది. ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక పాత్రికేయుడు సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌కు కూడా ఉగాది పురస్కారం లభించింది.
 
‘కళారత్న’ గ్రహీతలు వీరే..
గొల్లపూడి మారుతీరావు (రచయిత, నటుడు-విశాఖపట్నం), సతీష్‌ రెడ్డి (సైన్స్‌-నెల్లూరు), పొట్లూరి వెంకటేశ్వరరావు (జర్నలిజం-గుంటూరు), గరికపాటి నరసింహారావు (అవధానం-తూర్పుగోదావరి), సాయికృష్ణ యాచంద్ర (అవధానం-నెల్లూరు), వంగపండు ప్రసాదరావు (ఫోక్‌-విశాఖపట్నం), ఎ.ఎన్‌.జగన్నాథశర్మ (సాహిత్యం-విజయనగరం), వేమూరి వెంకట విశ్వనాథ్‌ (సంగీతం-కృష్ణా), చెరుకూరి వీరయ్య (ఇంజనీరింగ్‌-కృష్ణా), బల్లెం రోశయ్య (కృష్ణా-ఇంజనీరింగ్‌), సీహెచ్‌.అనంత శ్రీరామ్‌ (పాటల రచయిత-పశ్చిమగోదావరి), ఉమా చౌదరి (హరికథ-గుంటూరు), మహంకాళి సూర్యనారాయణశాస్త్రీ (కూచిపూడి-గుంటూరు), డాక్టర్‌ శారదా రామకృష్ణ (ఆంధ్ర నాట్యం-కృష్ణా), చిత్తూరు రేవంతి రత్నాస్వామి (వోకల్‌ మ్యూజిక్‌ -హైదరాబాద్‌), కళిషా అండ్‌ సుభాని (నాదస్వరం-ప్రకాశం), సింగమనేని నారాయణ (సాహిత్యం-అనంతపురం), పి.సత్యవతి (సాహిత్యం-కృష్ణా), కె.సంజీవ్‌రావు శిఖామణి (కవిత్వం-యానాం), గంగాధరశాసి్త్ర (సంగీతం-కృష్ణా), మానేపల్లి రుషికేశవరావు (సాహిత్యం-కృష్ణా), ఎం.శ్రీనివాసరావు (పెయింటింగ్‌-గుంటూరు), ఎస్‌.ఎం.పీరన్‌ (శిల్పి-ప్రకాశం), జయన్న (పెయింటింగ్‌-కడప), కడలి సురేష్‌ (డ్రామా-పశ్చిమ గోదావరి), అక్కల శ్రీరాం (శిల్పి-గుంటూరు), నేతి పరమేశ్వరశర్మ (రంగస్థలం-గుంటూరు), పల్లేటి లక్ష్మి కులశేఖర్‌ (రంగస్థలం-గుంటూరు), డాక్టర్‌ ఉమామహేశ్వరి (హరికథ-మచిలీపట్నం), ఎ.మురళీకృష్ణ (యాంకర్‌-ప్రకాశం), తుమ్మపూడి కోటేశ్వరరావు (సాహిత్యం-గుంటూరు), టి.ఎస్.రావు (సోషల్‌ సర్వీస్‌- కృష్ణా), మన్నెం వెంకటరాయుడు (సోషల్‌ సర్వీ స-గుంటూరు), శివప్రసాద్‌ రెడి ్డ(హస్తకళ-కర్నూలు), మీగడ రామలింగస్వామి (రంగస్థలం-శ్రీకాకుళం), పొట్లూరి హరికృష్ణ (తెలుగు-అనంతపురం), కొండపోలు బసవపున్నయ్య (సోషల్‌ సర్వీస్-గుంటూరు), రాధాకృష్ణరాజు (సోషల్‌ సర్వీస్‌- ప్రవాసాంధ్ర కర్ణాటక), నాయుడు గోపి (రంగస్థలం-గుంటూరు).
 
ఉగాది పురస్కారాలు వీరికే..
శ్రీకాకుళం: రఘుపాత్రుని శ్రీకాంత్, ఎల్‌.నందికేశ్వరరావు, బొనం గురుమూర్తి, విజయవాడ: చదల ఆనంద్‌, విజయనగరం: మళ్లీపురం జగదీశ్‌, జి.గౌరునాయుడు, ద్వారం లక్ష్మీ, విశాఖపట్నం: పోలూరి శాంతమూర్తి, జాలాది విజయలక్ష్మి, సి.హెచ్‌.శ్రీనివాసరావు, జి.లక్ష్మి, పిల్లా జమున, దామెర వెంకట సూర్యారావు, తూర్పుగోదావరి: ఎస్‌.ఆర్‌.ఎస్‌. కోళ్లురి, చింతా శ్యామ్‌ కుమార్‌, కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ, పి.సత్యనారాయణ రెడ్డి, ఎ.బాబూరావు, చిలుకూరి శ్రీనివాసరావు, నమిడి శ్రీధర్‌, సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌, ఇందుకూరి విజయలక్ష్మి, పశ్చిమగోదావరి: గట్టిం మాణిక్యాలరావు, దేవరకొండ బాలసుబ్రమణ్యం, వేమవరపు నర్సింహమూర్తి, ఎల్‌.ఆర్‌.కృష్ణబాబు, అనుమోలు వెంకటేశ్వరరావు, కృష్ణా: పాటిబండ్ల రజని, వేముల అకంబొట్టులు, ఫాదర్‌ పి.జోజయ్య, డి.జ్వాలచారి, పువ్వాడ తిక్కన సోమయాజి, వెన్న వల్లభరావు, కుమార సూర్యనారాయణ, మదుమూడి సుధాకర్‌, చింతా రవి బాలకృష్ణ, పరుచూరి విజయలక్ష్మి, దాసరి ఆల్వార్‌ స్వామి, దామోదర గణపతిరావు, డాక్టర్‌ రెజినా, వేదాంతం దుర్గాభవాని, గోళ్ల నారాయణరావు, అనగట వరప్రసాద్‌, కొట్టు రామారావు, గుంటూరు: ఎస్‌.ఎ్‌స.వి.రమణ, జాస్తి వీరాంజనేయులు, పి.వి.సుబ్బారావు, మంగళగిరి ప్రమీలాదేవి, మువ్వ వృషభాద్రిపతి, బాబా వాలిరావు, రవి రంగారావు, చెన్నుపాటి శ్రీనివాస్‌, గద్దె రామతులసమ్మ, పి.చంద్రశేఖర్‌, బిసిపోగు రవి, ప్రకాశం:కరుమూరి సీతారామయ్య, కదిరి నర్సింహారావు, విజయకాంత, కంచర్ల రామయ్య, ఏలూరి రఘుబాబు, నెల్లూరు: తుళ్లు సీనయ్య, సాయిహేమంత, కట్టా మురళీకృష్ణ, జె.బాలార్క, జి.బి.ఎస్.జాహ్నవి, చిత్తూరు: కొలకలూరి మధుజ్యోతి, వేటుకూరి భూదేవి, ఆర్‌.బి.ఎన్‌(చెన్నై), వి.సూరిబాబు, మునిరత్నం నాయుడు, అనంతపురం: బండి నారాయణస్వామి, కె.జగదీశ్‌, నల్లాని రాజేశ్వరి, డి.బాబు బాలాజీ, డి.రంగమ్మ, కె.నటరాజ నాయుడు, నన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి, వలి సాహెబ్‌, వెంకటయ్య, గంగాధర్‌, కర్నూలు: యలమర్తి రమణయ్య, వెలమశెట్టి రఘరాం, గుర్రాల రవికృష్ణ, బిక్కి కృష్ణ, హైదరాబాద్‌: జి.వి.ప్రభాకర్‌, కన్నెగంటి అనసూయ, ఈమని కళ్యాణి, నార్ల మధరిమ, యశోద ఠాకూర్‌.