Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 04 Mar 2017 00:48:33 IST

సూపర్‌ విజ్‌కు ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకులు

సూపర్‌ విజ్‌కు ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకులు

విజయవాడ, మార్చి3, (ఆంధ్రజ్యోతి): గత డిసెంబరు 26న జరిగిన ఐసీడబ్ల్యూఏ ఫైనల్‌, ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో ఇద్దరు సూపర్‌విజ్‌ విద్యార్థులు ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకులు సాధించా రు. కోల్‌కతాకు చెందిన ఐసీడబ్ల్యూఏ(సీఎమ్‌ఏ) చాప్టర్‌ అధికా రికంగా ఈ ఫలితాలు ప్రకటించింది. ఐసీడబ్ల్యూఏ ఫైనల్‌ విభాగంలో చిత్తూరుకు చెందిన నాగోలు మోహనకుమార్‌కు ఆలిండియా ఫస్ట్‌ర్యాంకు సాధించగా, ఐసీడబ్ల్యూఏ ఇంటర్‌ విభాగంలో కృష్ణాజిల్లాకు చెందిన జె.లక్ష్మీప్రసన్నఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు పొందింది. వీటితోపాటు ఐసీడబ్ల్యూఏ ఫైనల్లో రామసముద్రానికి చెందిన లతాశ్రీకి మూడో ర్యాంకు, విజయవాడకు చెందిన సాయిమహితకు 18వ ర్యాంకు, విశాఖకు చెందిన జి.మహేశకు 44వ ర్యాంకు వచ్చాయి.
 
ఐసీడబ్ల్యూఏ ఇంటర్‌లో ఫస్ట్‌ ర్యాంకుతోపాటు రేపల్లెకు చెందిన పరిశ లక్ష్మికి రెండో ర్యాంకు, ద్వారకా తిరుమలకు చెందిన బండారు వెంకటదుర్గాప్రసాద్‌కు మూడో ర్యాంకు, కృష్ణాజిల్లాకు చెందిన నూతలపాటి వంశీకృష్ణకు అయిదో ర్యాంకు, పి.శివకుమార్‌కు 28వ ర్యాంకుతోపాటు చిన్నబోయిన రెడ్డియ్య 31వ ర్యాంకు సాధించారు. ఐఐసీడబ్ల్యూఏ ఫైనల్‌ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకర్‌ నాగోలు మోహనకుమార్‌ మాట్లాడుతూ సూపర్‌విజ్‌ కోచింగ్‌తోనే గతంలో కూడా సీఏ ఫైనల్లో ఆలిండియా సెకండ్‌ ర్యాంక్‌ సాధించానని చెప్పాడు. ఐసీడబ్ల్యూఏ ఇంటర్‌ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకరు జె. లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ తనకు ఫస్ట్‌ ర్యాంకు రావడానికి గుప్తా టెక్నిక్స్‌, మోటివేషనతోపాటు తన తల్లిదండ్రులు కూడా కారణమన్నది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ సబ్బినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఫైనల్‌, ఇంటర్‌లలో ఆలిండియా ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటివరకు సూపర్‌విజ్‌కు 52 సార్లు ఆలిండియా ర్యాంకులు వచ్చాయని తెలిపారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.