
నిర్మాణ సంస్థః వీణ వేదిక ప్రొడక్షన్స్
నటీనటులుః శివ రామచంద్రవరపు, సూర్య శ్రీనివాస్, చందన్రాజ్ తదితరులు
సంగీతంః సిద్ధార్థ్ వాకిన్స్
సినిమాటోగ్రఫీః రాజా భట్టాచారి
నిర్మాతః వీణ వేదిక ప్రొడక్షన్స్
దర్శకత్వంః గాజుల పల్లి త్రివిక్రమ్
కష్టమెంత పడతామో, ఫలితం అంతే ఉంటుందనే సందేశాన్నిచెప్పే ప్రయత్నమే `కారందోశ`. దర్శకుడు వీణ వేదికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం టైటిల్ కూసింత క్యూరియాసిటీని కలిగించింది. మరి అసలు కథంటే తెలుసుకుంటేనే కథ దోశంలో కారముందా చప్పగా ఉందా అని తెలుస్తుంది..
కథః
వేమన(శివ రామచంద్రవరపు), రవి(సూర్యశ్రీనివాస్), బలి(అనిల్) రూమ్మేట్స్. కష్టడితేనే మనిషికి గుర్తింపు వస్తుందని నమ్మే వక్తి రవి. అందుకనే ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతుంటాడు. వేమన మాత్రం ఏదో ఒకటి చేసి ఏదిగిపోవాలనుకునే వ్యక్తి. బలి ఏ కష్టం లేకుండా కాలం గడిపేస్తుంటాడు. ఈ ముగ్గురు స్నేహితలు జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకుందనే కథ.
విశ్లేషణః
కలలను నిజం చేసుకోవాలంటే కష్టపడాలంటూ దర్శకుడు త్రివిక్రమ్ గాజులపల్లి చెప్పే ప్రయత్నం చేశాడు. లక్ష్యం పెద్దదైనప్పుడు కష్టం కూడా అదే రేంజ్లో ఉంటుంది. సినిమా ఓపెనింగ్ బావుంది. పాత్రల పరిచయం ఆకట్టుకుంటుంది. క్యారెక్టర్స్ నిజ జీవితానికి దగ్గరగా అనిపిస్తాయి. అక్కడక్కడా కామెడి, కొన్ని ఎమోషనల్ సీన్స్ మినహా సినిమా చెప్పుకునేంత లేదు. అయితే సందేశాత్మక చిత్రాలు చేయాలంటే సందేశం ఉంటే సరిపోదు. దాన్ని ఆసక్తికరంగా ముందుగాకు తీసుకెళ్లగలిగే సన్నివేశాలు కూడా ఉండాలి. షార్ట్‌ఫిలిం చేయాల్సిన కథతో దర్శకుడు సాగదీసే ప్రయత్నం చేశాడు. వేమన, రవి, బలి పాత్రల మధ్య సీన్స్ బోరింగ్‌గా అనిపిస్తాయి. రాజా భట్టాచారి సినిమాటోగ్రఫీ బావుంది. సిద్ధార్థ్ వాకిన్స్ సంగీతం కూడా పరావాలేదు. రన్ టైం, సాగదీసే డ్రామా ప్రేక్షకుడికి ఇబ్బందిగా మారుతుంది.
బోటమ్ లైన్ః కారందోశ...అనుకున్నంత రుచిగా లేదు...
రేటింగ్ః 2/5