
రవీంద్రభారతి/హైదరాబాద్, డిసెంబరు 2: తెలుగు విశ్వవిద్యాలయం 31వ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా ప్రముఖ కవి నందిని సిధారెడ్డికి విశిష్ట పురస్కారం ప్రధానం ప్రకటించింది. ఉత్సవాలలో భాగంగా.. వర్సిటీ ఆడిటోరియంలో నందిని సుధారెడ్డికి పురస్కారం అందించి సత్కరించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో పాటు కవి దేశపతి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వెలచాల కొండల్రావు, వర్సిటీ రిజిసా్ట్రర్ సత్తిరెడ్డి పాల్గొన్నారు.