Oct 23 2016 @ 15:18PM

రష్మీ తాజా చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా!

గుంటూరు టాకీస్ సినిమాతో తన అందాల ఆరబోతను ఓ రేంజ్‌లో చూపించింది రష్మీ. అయితే.. దాని వల్ల బాక్సాఫీస్ వద్ద రష్మీకి మైలేజ్ వచ్చిందేమో కానీ.. సినిమా మాత్రం బోల్తా కొట్టింది. ఇప్పుడు మరో హర్రర్ సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం పలు సినిమాలతో పాటు రష్మీ నటించిన ‘తను వచ్చెనంట’ సినిమా కూడా రిలీజైంది. కానీ, ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫిల్మ్ నగర్ వర్గాలు సినిమా బాగాలేదనేశాయి. జోంబీ (దెయ్యం) కథ అంటూ రొటీన్ హర్రర్ కామెడీ సినిమాను చూపించారంటూ సినీ విమర్శకులు పెదవి విరిచారు. సినిమాలో వచ్చే ఏ సన్నివేశం కూడా ఆసక్తికరంగా లేదని తేల్చి చెప్పారు. సినిమాలో రష్మీ అందాల ఆరబోత మినహా.. ఈ సినిమాకు కలసి వచ్చిన అంశమేదీ లేదని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఆశించాల్సినదేమీ లేదంటున్నారు. సినిమాల్లో ఎలాగైనా నటించాలన్న ఆతృతతో రష్మీ వచ్చిన ఆఫర్‌నల్లా ఓకే చేసేస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఆమె తీసిన ఏ సినిమాలోనూ విలువల్లేవని, డీసెంట్ కంటెంట్ లేదని విమర్శిస్తున్నారు. నిర్మాతలు కూడా ఆమె అందాల ఆరబోతతో క్యాష్ చేసుకోవాలనే చూస్తున్నారని అంటున్నారు. మరి, ఈ అపజయాలైనా రష్మీకి గుణపాఠం నేర్పుతాయా అని అనుకుంటున్నారు సినీ విమర్శకులు.