Oct 7 2016 @ 16:43PM

అభినేత్రి రివ్యూ

స‌మర్పణ‌: కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌
సంస్థ‌: ఎం.వి.వి.సినిమా, బ్లూ స‌ర్కిల్ కార్పొరేష‌న్‌, బి.ఎల్.ఎన్. సినిమా
న‌టీన‌టులు: ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్‌, సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వీ, షకలక శంకర్‌ తదితరులు
నిర్మాత‌లు: ఎం.వి.వి.స‌త్యనారాయ‌ణ‌
సంగీతం: త‌మ‌న్‌, జి.వి.ప్రకాష్‌
సినిమాటోగ్రఫీ: మనీష్‌ నందన్‌,
ఎడిటింగ్‌: ఆంటోనీ,
ఆర్ట్‌: వైష్ణరెడ్డి,
కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్‌
త‌మ‌న్నా న‌టించిన త్రిభాషా చిత్రం `అభినేత్రి`. ప్రభుదేవా హీరోగా న‌టించార‌ని, సోనూసూద్‌ కీల‌క పాత్ర పోషించార‌ని తెలియ‌గానే సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. `మ‌ద‌రాసుప‌ట్టణం`, `నాన్న` వంటి సినిమాల‌ను తీసిన ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శక‌త్వం అన‌గానే మ‌రింత ఆస‌క్తి నెల‌కొంది. సోనూసూద్ ఈ చిత్రం క‌థ న‌చ్చి హిందీ వెర్షన్‌కి నిర్మాత‌గా మారారు. ప్రభుదేవా త‌మిళ వెర్షన్‌ను నిర్మించారు. మ‌రి నిర్మాణంలో ఉండ‌గానే సినిమాకు ఇన్ని హంగులు తోడ‌వ‌డంతో సినిమాపై క్యాజువ‌ల్‌గానే అంచ‌నాలు పెరిగాయి. ఇంత‌కీ `అభినేత్రి` అంద‌రి అంచ‌నాల‌ను చేరుకుందా? లేదా? త‌మ‌న్నా ప‌ల్లెటూరి పిల్లగా ఏమాత్రం న‌టించింది? వంటివ‌న్నీ తెలుసుకోవాలంటే చ‌దివేయండి మ‌రి.
 
కృష్ణ (ప్రభుదేవా) ఓ ప్రైవేట్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. అత‌నికి తండ్రి అంటే చ‌చ్చేంత భ‌యం. త‌న బామ్మ ఆఖ‌రి కోరిక తీర్చడానికి దేవి(త‌మ‌న్నా)ను పెళ్లి చేసుకుంటాడు. త‌న‌తో పాటు ముంబైకి తీసుకొస్తాడు. అక్కడ ఒక ఫ్లాట్‌లో దిగుతాడు. ప‌ల్లెటూరి అమ్మాయిలా ఉన్న దేవి ఉన్నట్టుండి అల్ట్రా మోడ్రన్‌గా క‌నిపిస్తుంది. అది ఎలా సాధ్యమైంది? సినిమాల్లో హీరోగా న‌టించే రాజ్ ప్రేమించిన రూబీ(త‌మ‌న్నా) ఎవ‌రు? రూబీ ఇంత‌కీ రాజ్ ప్రేమ‌ను అంగీక‌రించిందా? లేదా? దేవికి, రూబీకి ఉన్న సంబంధం ఏంటి? రూబీ కోరిక ఏంటి? దాన్ని కృష్ణ ఎలా తీర్చాడు? రూబీతో కృష్ణ చేసుకున్న అగ్రిమెంట్ ఏంటి? దేవి గ‌డ‌ప‌దాటితో ఎలా ప్ర‌వ‌ర్తిస్తుంది? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.
ప్లస్ పాయింట్స్
- త‌మ‌న్నా నట‌న (ప‌ల్లెటూరి పిల్లగా, అల్ట్రా మోడ్రన్ గ‌ర్ల్ గా)
- ప్రభుదేవా ఎక్స్‌ప్రెష‌న్స్
- అక్కడక్కడా స‌ప్తగిరి డైలాగులు
- ముర‌ళీశర్మ ఎక్స్‌ప్రెష‌న్‌
- సోనూసూద్ న‌ట‌న‌
- డ్యాన్సులు
- సినిమాటోగ్రఫీ
- క్లైమాక్స్ సీన్‌
మైన‌స్ పాయింట్లు
- క‌థ‌లో కొత్తద‌నం లేక‌పోవ‌డం
- స‌స్పెన్స్ లేదు
- పాట‌లు బాగా లేవు
- సినిమాలో చాలా పాత్రలు వేస్ట్
- డైరెక్షన్ మెప్పించ‌దు
- బ‌ల‌మైన స‌న్నివేశాలు లేవు
స‌మీక్ష
సినిమాల్లో హీరోయిన్లు కావాల‌ని చాలా మందికి ఉంటుంది. అయితే అది అంత తేలికైన విష‌యం కాదు. కానీ ఆ విష‌యాన్ని అర్థం చేసుకునే ప‌రిప‌క్వత ఉండాలి. అలాంటి పరిప‌క్వత లేని ఓ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడుతుంది. అదే ఇంట్లోకి కాపురం వ‌చ్చిన అమ్మాయి శ‌రీరంలోకి ప్రవేశిస్తుంది. త‌న ల‌క్ష్యాన్ని ఆమె ద్వారా తీర్చుకోవాల‌ని అనుకుంటుంది. అది ఎలా సాధ్యమైంద‌న్న అంశంతో సినిమాను తెర‌కెక్కించారు. ఏమాత్రం కొత్తద‌నం లేని అంశ‌మిది. పైగా త‌న భార్య ఇష్టానుసారం ప్రవ‌ర్తిస్తుంటే ప్రభుదేవా ఏమీ చేయ‌లేన‌ట్టు నిస్సహాయుడిగా చూస్తుంటాడు. బాలీవుడ్ సినిమాలో గ్రాండ్‌గా లాంఛ్ అయిన అమ్మాయి గురించి ప్రభుదేవాతోనే ఉంటున్న స‌ప్తగిరికి తెలియ‌క‌పోవ‌డం మ‌రీ విడ్డూరంగా అనిపిస్తుంది. సినిమా ఎక్కడా లాజిక్‌కి అంద‌దు. అన్నిటినీ త‌న కంట్రోల్‌లో ఉంచుకోగ‌ల దెయ్యం ఒక చిన్న కాంట్రాక్ట్‌కి లొంగి ఉండ‌టం ఏంటో అర్థం కాదు. పాట‌లు మెప్పించవు. త‌మ‌న్నా మాత్రం ప‌ల్లెటూరి పిల్ల పాత్రలో ఒదిగిపోయింది. ముర‌ళీశ‌ర్మ కొత్త త‌ర‌హా పాత్రలో బాగా చేశారు. పృథ్వి పాత్ర ఎక్కడా న‌వ్వించ‌దు. `ప్రపంచంలో ఏ భ‌ర్తా త‌న భార్యకి ఈ మాట‌ను చెప్పి ఉండ‌డు` అని ప్రభుదేవా క్లైమాక్స్ లో అనే మాట బావుంది. సినిమా మొత్తం ఫ్లాట్‌గా సాగుతుంది. రుచీప‌చీ లేని ప‌త్యం భోజ‌నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ బావుంటాయి.
బోట‌మ్ లైన్‌: `అభినేత్రి` ఆశించినంత గొప్పగా లేదు...సాదాసీదాగా 'అభినేత్రి'
రేటింగ్‌: 2.5/5