
నాగర్కర్నూల్, సెప్టెంబరు 4: మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో నెలకొల్పిన ఏకశిలా విగ్రహం ఐశ్వర్య గణపతిగా వెలుగొందుతోంది. క్రీ.శ.1140లో ఈ విగ్రహాన్ని చెక్కినట్లు చరిత్ర చెబుతోంది. జాతీయ రహదారి నుంచి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో తైలకుడు అనే రాజు 30 అడుగుల ఎత్తున్న శిలకు శిల్పులతో గణపతి ఆకారాన్ని చెక్కించారని చరిత్రను బట్టి తెలుస్తోంది. విగ్రహం పనులు కొనసాగుతున్న సమయంలోనే తండ్రి విక్రమాదిత్యుడు చనిపోయాడనే వార్త తెలుసుకున్న తైలకుడు మధ్యలోనే వెళ్లిపోయినట్లు ఆధారాలున్నాయి. దీంతో విగ్రహ నిర్మాణం, ఆలయం పూర్తి కాలేదు. దేశంలో ఎక్కడ కూడా 30 అడుగుల ఎత్తున్న ఏకశిలా వినాయక విగ్రహం లేదు.