Aug 12 2016 @ 01:42AM

రచయిత ఇచ్ఛాపురపు రామచంద్రం కన్నుమూత

విశాఖపట్నం ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత ఇచ్ఛాపురపు రామచంద్రం (74) గురువారం ఉదయం కన్నుమూశారు. గుండెనొప్పి రావడంతో ఈ నెల 5న ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు వైద్యులు బైపాస్‌సర్జరీ చేశారు. అప్పటి నుంచి ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం 10.21 గంటలకు ఆయన కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో పుట్టిన రామచంద్రం అనకాపల్లి ఎల్‌ఐసీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూనే రచనావ్యాసాంగాన్ని కొనసాగించారు.బాలసాహిత్యం లో 40నుంచి 50 వరకూ పుస్తకాలు రాసిన ఆయన ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక పత్రికల్లో ఆయన కథలు వందకుపైగా ప్రచురితమయ్యాయి.