Jul 20 2016 @ 10:44AM

ఎందరో మహానుభావులు... అందరూ కృష్ణా, గుంటూరు వారే !

  • కృష్ణా తీరంలో వెండితెర వెలుగులు..
  • చలనచిత్ర ప్రముఖుల ప్రస్థానం ఇక్కడి నుంచే..
  • కథానాయకి, నాయకులు, దర్శకులు, రచయితలు ఎందరో.. మహానుభావులు
  • తెరపై తెలుగుదనానికి పట్టం కట్టిన కళాకారులు
కృష్ణానది పరివాహక ప్రాంతమైన గుంటూరు, కృష్ణాజిల్లాలకు చెందిన చలనచిత్ర ప్రముఖులు వెండితెరపై రాజ్యమేలారు. కృష్ణమ్మ నీరు తాగిన ఎందరో ప్రముఖులు తెలుగు కళామ తల్లికి ముద్దు బిడ్డలుగా ఖ్యాతి పొందారు. కథానాయకి, కథానాయకులు మాత్రమే కాదు.. ప్రతి నాయకుల పాత్రలకు ప్రాణం పోశారు. వెండితెరపై నవ్వులను విరజిమ్మిన హాస్యనటులు.. రచయితలు, దర్శకులు.. ఇక్కడివారే అని గర్వంగా ప్రకటించవచ్చు.

నందమూరి తారక రామారావు, బాలకృష్ణ, హరికృష్ణ (నిమ్మకూరు), అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున (వెంకట రాఘ వాపురం), సూపర్‌ స్టార్‌ కృష్ణ, మహేష్‌బాబు (బుర్రిపాలెం), శోభనబాబు (చిననందిగామ), సావిత్రి (తాడేపల్లి), జమున (దుగ్గిరాల), ఊర్వశి శారద (తెనాలి) వంటి అగ్రశ్రేణి తారాగణం కృష్ణాతీరానికి చెందినవారే. యువతరం కలల రాణిగా, హాలీవుడ్‌ తార గ్రేటాగార్బో ప్రతిరూపంగా నిలిచిన కాంచనమాల (తెనాలి), అభినవ సీతామహాసాధ్విగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకొన్న సీనియర్‌ శ్రీరంజని (మురికిపూడి), తొలి మహిళా చలనచిత్ర నిర్మాతగా, నటిగా రాణించిన దాసరి కోటి రత్నం (ప్రత్తిపాడు), గయ్యాలి పాత్రలకు జీవం పోసిన ఛాయాదేవి (తిక్కి రెడ్డివారిపాలెం), మహాకవి కాళిదాసు, నర్తనశాల వంటి చిత్రాల నిర్మాత లక్ష్మీరాజ్యం (తెనాలి), కథానాయికలుగా రాణించిన కృష్ణకుమారి, షావుకారు జానకి, వహీదారెహమాన్ (గుంటూరు), పలు చిత్రాలలో కథానాయికగా నిలిచిన ప్రభ (తెనాలి), సుమలత (గుంటూరు), శంకరాభరణం రాజ్యలక్ష్మి (తెనాలి) వెండి తెరపై రాణించారు.
 
నవరస నటనా చాతుర్యం..
ప్రతినాయక పాత్రలకు ప్రాణం పోసిన వేమూరి గగ్గయ్య (వేమూరు), షావుకారు, కన్యాశుల్కం వంటి చిత్రాల ద్వారా అరుదైన నటునిగా రాణించిన డాక్ట ర్‌ గోవిందరాజుల సుబ్బారావు (తెనాలి), తన ఈల పాటతో రంగస్థల సినీ ప్రేక్షకులను ఉర్రూ తలూ గించిన పద్మశీ కల్యాణం రఘురామయ్య (సుద్దపల్లి), వెండితెరపై నవ్వుల పువ్వులను విరజిమ్మిన వంగర (సంగంజాగర్లమూడి), డాక్టర్‌ బ్రహ్మానందం (సత్తెనపల్లి), గాయక శిఖామణి పారుపల్లి సుబ్బారావు (తెనాలి), పెద్ద మనుషులు, భక్తపోతన వంటి చిత్రాల్లో నటించిన జంధ్యాల గౌరినాథశాస్ర్తి (గుంటూరు), అస మాన నటుడు ముదిగొండ లిం గమూర్తి (తెనాలి), కళావాచ స్పతి కొంగర జగ్గయ్య (మోరంపూడి), క్యారెక్టర్‌ నటునిగా వెండితెరకు కీర్తిప్రతిష్టలను తెచ్చిన గుమ్మడి (రావికంపాడు), శకుని పాత్రకు ప్రాణం పోసిన ధూళిపాళ్ల (దాచేపల్లి), ప్రతినాయకునిగా రాణించిన ముక్కామల(గుంటూరు), విలక్షణమైన నటుడు సీఎస్‌ఆర్‌ ఆంజనేయులు (నరసరావుపేట), రాజకీయ సినీదురంద్రుడు కోన ప్రభాకరరావు (బాపట్ల), సినీనటునిగా జాతీయ అవార్డు పొందిన పీఎల్‌ నారాయణ (బాపట్ల) గుంటూరు జిల్లాకు చెందిన కళాకారులు.
 
రచనా శిల్పులు..
అసమాన రచయితలుగా రాణించిన సముద్రాల సీనియర్‌, జూనియర్‌ (పెదపులివర్రు), అనువాద రచయితగా పేరుపొందిన అనిశెట్టి సుబ్బారావు (నరసరావుపేట), శతాధిక నాటక సినీ రచయిత డాక్టర్‌ కొర్రపాటి గంగాధరరావు, పలు చిత్రాలకు రచయితగా వ్యవహరించిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి (ఇటికంపాడు), ఎం దివాకరబాబు (గుంటూరు), ఎంవీఎస్‌ హరనాథరావు (గుంటూరు), మాటల తూటాలను పేల్చిన బొల్లిముంత శివరామకృష్ణ (తెనాలి), మోదుకూరి జా న్సన (కొలకలూరు), కోనవెంకట్‌ (బాపట్ల), వైఎస్‌ కృష్ణేశ్వరరావు (పొన్నూరు), సినీ రచయితగా, దర్శకునిగా రాణించిన త్రిపురనేని గోపి చంద్‌ (తెనాలి), బోయపాటి శ్రీను, కొరటాల శివ (పెదకాకాని), పోసాని కృష్ణమురళి (పెదకాకాని) వెండితెరపై అద్భుతం గా రాణించారు.

కృష్ణాజిల్లాలో..
కృష్ణా జిల్లాకు చెందిన సినీ రచయిత, దర్శకుడు జంధ్యాల (విజయవాడ), సినీనిర్మాత చలసాని అశ్వనీదత (విజయవాడ), అభ్యుదయ చిత్రాల నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం (గుడివాడ), ప్రతినాయకునిగా, క్యారెక్టర్‌ నటునిగా రాణించిన కైకాల సత్యనారాయణ (కౌతవరం), అసాధారణ నటునిగా రాణించిన కోట శ్రీనివాసరావు (కంకిపాడు), నటులుగా రాణించిన సుత్తి వీరభద్రరావు(విజయవాడ), సుత్తివేలు (మచిలీపట్నం), చలపతిరావు, రవిబాబు (మంగళంపాడు), మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (లింగాయపాలెం), పెరుమాళ్లు (గుడివాడ) వెండితెరపై చెరగని ముద్రలు వేశారు. సినీ నిర్మాతలుగా రాణించిన దుక్కిపాటి మధుసూదనరావు (ముదినేపల్లి), అట్లూరి పుండరీకాక్షయ్య (కొమరవోలు), వీబీ రాజేంద్ర ప్రసాద్‌ (భట్లపెనుమర్రు), దర్శకులుగా తమదైన ముద్రలు వేసిన కేఎస్‌ ప్రకాశరావు, కె రాఘవేంద్రరావు, కె బాపయ్య, కె మురళీమోహనరావు (కోలవెన్ను), తాతినేని ప్రకాషరావు, తాతినేని రామారావు, అట్లూరి మోహనగాంధీ, ఉమామహేశ్వరరావు, ఎంవీ రఘు, ఎం సంజీవి (విజయవాడ), పూసల (అవనిగడ్డ) చలనచిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. గుంటూరు జిల్లా బేతపూడికి చెందిన సినీరచయితలు పరుచూరి సోదరులు కృష్ణాజిల్లా మేడూరులో స్థిరపడ్డారు.

గుంటూరు జిల్లాలో..
తెలుగు చిత్రానికి విజ్ఞాన సర్వసంగా నిలిచిన నిర్మాత చక్రపాణి (తెనాలి), తెలుగుదనాన్ని ప్రతిబిం బించిన కళాతపస్వి కె విశ్వనాథ్‌ (పెదపులివర్రు), పద్మాల య నిర్వాహకులు జి.ఆదిశేషగిరిరావు, హనుమంతరావు (బుర్రి పాలెం), సినీనిర్మాతలు ముప్పలనేని శేషగిరిరావు (నరసాయపాలెం), చిన్నపరెడ్డి (గురజాల), ఏకాంభరేశ్వరరావు (జమ్ములపాలెం) గుంటూరు జిల్లా వాసులే. ఎం.మల్లికార్జునరావు (మురికిపూడి), ఎం.శివ నాగేశ్వరరావు (తక్కెళ్లపాడు), భీమనేని శ్రీనివాసరావు (తాతపూడి), సముద్ర (బోయపాలెం), ముప్పలనేని శివ (నరసాయపాలెం), జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్‌) వినుకొండ, సినీ దర్శకులుగా రాణించారు. సినీ మధుర గాయనీమణులు రావు బాలసరస్వతి (బాపట్ల), ఎస్‌.జానకి (పెదపులివర్రు), సినీ దర్శకుడు బి.గోపాల్‌ (మంగ ళగిరి), చక్రవర్తి (పొన్నెకల్లు), మనో (సత్తెనపల్లి), సినీ గాయకుడు మాధవపెద్ది సత్యం (బ్రాహ్మ ణకోడూరు) గుంటూరు జిల్లాకు ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చారు. సినీ పాత్రికేయులుగా కొడవటిగంటి కుటుంబరావు, ఇంటూరి వెంకటేశ్వరరావు (తెనాలి) చిత్ర పరిశ్రమకు మార్గదర్శకులుగా నిలిచారు.