Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Thu, 14 Jul 2016 06:17:21 IST

‘సమాజానికి నిజమైన వైద్యులు సాహితీవేత్తలే’

సమాజానికి నిజమైన వైద్యులు సాహితీవేత్తలే

ఆంధ్రజ్యోతి హైదరాబాద్‌ సిటీ : రోగగ్రస్థ మైన సమాజానికి చికిత్సనందించే నిజమైన వై ద్యులు సాహితీవేత్తలేనని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆ ర్‌ ఆడిటోరియంలో బుధవారం తెలుగు విశ్వవిద్యాలయం, 2013 సంవత్సరానికిగాను తెలుగు సాహిత్యం వివిధ ప్రక్రియలలోని ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రమణాచారి మాట్లాడుతూ పురస్కారం సమాజంలో గౌరవాన్ని పెంచడంతోపాటు బాధ్యతనూ గుర్తుచేస్తుందన్నారు. కథ, కవిత, నాటకం, నవల వంటి పలు సాహిత్య ప్రక్రియల్లో 10 ఉత్తమ గ్రంథాలను ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలను అభినందించారు. అనంతరం ఉత్తమ గ్రంథాలుగా ఎంపికైన రచయితలకు రూ.20,116 అందజేసి సన్మానించారు. పురస్కారం దక్కిన పుస్తకాలు ‘శ్రీ చరణ శరణాగతి’ పద్య కవిత (ఆచార్య రావికంటి వసునందన్‌), ‘గాలిరంగు’ వచన కవిత (దేవిప్రియ), ‘చింటుగాడి కథలు బాలసాహిత్యం(పైడిమర్రి రామకృష్ణ), ‘‘పేగు కాలిన వాసన’’ కథ/కథానిక(ఆంధ్రజ్యోతి నవ్యవీక్లీ సంపాదకులు ఎ.ఎన్‌.జగన్నాథ శర్మ), ‘‘వొయినం’’నవల(జాజుల గౌరి),‘‘సాహిత్యవీధి’’సాహిత్య విమర్శ (డా.శ్రీరంగా చార్య), ‘‘గుణనిధి’’నాటకం(డా.కొట్టే వెంకటాచార్యులు), ‘‘మాల్గుడి కథలు’’అనువాదం(ఆచార్యసీ మృణాళిని), ‘‘తెలివాహ గోదావరి’’వచన రచన (డా.సంగనభట్ల నర్సయ్య), ‘‘నిర్జన వారధి’’రచయిత్రి ఉత్తమ గ్రంథం(కొండపల్లి కోటేశ్వరమ్మ). సభాధ్యక్షత వహించిన తెలుగువర్సిటీ వీసీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ పురస్కారాల ఎంపికలో న్యాయనిర్ణేతలకు సంపూర్ణ స్వేచ్ఛ నిచ్చామని పేర్కొన్నారు. గడచిన రెండేళ్లలో తెలుగు యూనివర్సిటీకి అదనంగా రూ.27కోట్లు కేటాయించిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో రిజిసా్ట్రర్‌ ఆచార్య వి. సత్తిరెడ్డి, డా.జుర్రు చెన్నయ్య పాల్గొన్నారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.