Jun 29 2016 @ 05:59AM

తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాలు

రవీంద్రభారతి: తెలుగు భాషా సాహిత్యాలు, కళా సాంస్కృతిక రంగాల్లో విశిష్ఠ సేవలందించిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2014 సంవత్సరానికి ప్రతిభా పురస్కారాలు ప్రకటించింది. జూపాక సుభద్ర(కవిత), డాక్టర్‌ దిలావర్‌(విమర్శ), బి.అంజనీరెడ్డి(చిత్రకళ), బి.శ్రీనివాసరెడ్డి(శిల్పకళ), డాక్టర్‌ పి.అలేఖ్య(నృత్యం), హైదరాబాద్‌ బ్రదర్స్‌ డి.శేషాచారి, రాఘవాచారి(సంగీతం), దాసు కేశవరావు(పత్రికారంగం), సీవీకేరావు(నాటకరంగం), మెట్ల కిన్నెర మొగులయ్య(జానపద కళలు), త్రిగుళ్ల శ్రీహరిశర్మ(అవధానం), వావిలికొలను రాజ్యలక్ష్మి(ఉత్తమ రచయిత్రి), శిరంశెట్టి కాంతారావు(కథ/నవల)లను విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఎంపిక సంఘం పురస్కారాలకు ఎంపిక చేశారు. దీనికి నిర్వహణ మండలి ఆమోదం తెలిపిందని, త్వరలో హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేస్తామని రిజిసా్ట్రర్‌ ఆచార్య కె.తోమాసయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కొక్కరికీ రూ.20,116, పురస్కార పత్రం అందజేసి సత్కరిస్తామని రిజిసా్ట్రర్‌ తెలిపారు.