Apr 22 2016 @ 02:18AM

హరికథా కళాకారుడు హరిశంకర శాస్త్రి కన్నుమూత

శంభునిపేట (వరంగల్‌): ప్రముఖ హరికథా కళాకారుడు, పండితుడు, బహుభాషా కోవిదుడు వెలిదె హరిశంకర శాసి్త్ర భాగవతార్‌ గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు.. కొంతకాలంగా వృద్ధాప్యసమస్యలతో భాదపడుతున్న ఆయన రంగశాయిపేటలోని తనస్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1930 జులై 5న జన్మించిన హరిశంకర శాసి్త్ర.. అనేక వేదికలపై హరికథాగానం చేసి పలు అవార్డులు అందుకున్నారు. 2006లో పోతన విజ్ఞానపీఠం, 1981లో మామునూరు పోలీస్‌ బెటాలియనలో ఆయనకు ఘనసన్మానం జరిగింది. 1982లో ఉప్పల్‌ రైల్వే అథారిటీస్‌ ‘సువర్ణ ఘంటాకంకణం’’తో సత్కరించింది. 1988లో నాటి సీఎం ఎన్టీఆర్‌ చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. హరిశంకర శాసి్త్ర హరికథలు దూరదర్శన, రేడియోలో ప్రసారమయ్యాయి.