Feb 23 2016 @ 16:22PM

గజాలా పెళ్లి భాజాలు...

జగపతిబాబు హీరోగా ‘నాలో ఉన్న ప్రేమ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ గజాలా గుర్తుందా..? అదేనండీ ‘స్టూడెంట్ నెంబర్ 1, కలుసుకోవాలని, తొట్టిగ్యాంగ్, అల్లరి రాముడు, మల్లీశ్వరీ’ వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుందీమ్మడు. అరకొర అవకాశాలతో అప్పుడప్పుడు తెరపై కనిపించిన గజాలా గత ఐదారేళ్ల నుంచి తెరమరుగయింది. దాదాపు 28 సినిమాల్లో నటించిన గజాలా బుధవారం వివాహం చేసుకోనుందట. అది కూడా ఓ టీవీ నడుడిని పెళ్లి చేసుకోబోతోందట. హిందీ సీరియల్స్‌లో విలన్‌గా నటిస్తూ.. ప్రస్తుతం కొంత బ్రేక్ తీసుకున్న ఫైజల్ రజా ఖాన్‌తో రేపు గజాలా పెళ్లి జరగనుంది. భారీ హంగామాతో కాకుండా.. సింపుల్‌గా పెళ్లిచేసుకోబోతున్నారట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహం జరగనుందట. నాలుగేళ్ల క్రితం ఓ పార్టీలో గజాలాను చూసారట ఫైజల్. అలా వారిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసిందట. ఓ ఫోటోగ్రాఫర్‌గా కూడా గజాలా తనకు ఎంతో సాయం చేసిందంటున్నారు ఫైజల్.