desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 31 2016 @ 03:00AM

మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రావు మృతి

కొడిమ్యాల, జనవరి 30: కరీంనగర్‌ జిల్లా బుగ్గారం మాజీ ఎమ్మెల్యే జోగిన్‌పెల్లి దామోదర్‌రావు(81) అనారోగ్యంతో శనివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. దామోదర్‌రావు స్వస్థలం కొడిమ్యాల మండలం తిర్మలాపూర్‌ అనుబంధ గ్రామమైన పోతారం. 1972లో బుగ్గారం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. భారతీయ కిసాన్‌ సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా, రాషీ్ట్రయ స్వయం సేవక్‌ సంఘ్‌లో రాష్ట్ర బాధ్యుడిగా కొనసాగారు.