
- ఏప్రిల్‌కి దేశీయ నావిగేషన్ వ్యవస్థ
- 2018లో చంద్రయాన్-2: షార్ డైరెక్టర్
శ్రీహరికోట(సూళ్లూరుపేట), జనవరి 26: ‘‘అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో అతిపెద్ద వెుౖలురాయిని దాటింది. ఎన్నో ఒడిదుడుకులు అదిగవిుంచింది. 50వ రాకెట్ ప్రయోగం పూర్తి చేసుకుంది. అంతరిక్ష ప్రయోగాలు మరింత వేగవంతం చేయాలి. భారీ ప్రయోగాలే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి. ఇందుకు తగినట్లుగా శ్రీహరికోట సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రాన్ని(షార్) అభివృద్ధి చేసుకుంటున్నాం’’ అని ఆ కేంద్ర డైరెక్టర్ పి కున్హికృష్ణన్ వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా షార్‌లోని కల్పన అతిథిభవనంలో ఆయన మంగళవారం మావూట్లాడారు. షార్ భవిష్యత్ ప్రణాళికలు ప్రకటించారు. ఈ ఏడాది మో ఏడు రపుయెూగాలు నిర్విహంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నావుని వెల్లడించారు. వూర్చి 10న పీఎస్ఎల్వీ-సీ రాకెట్ ద్వారా దేశీయావిగేషన్ వ్యవస్థ 6వ ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్‌ను, వూర్చి 31న పీఎస్ఎల్వీ-సీ ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్- 1జిని ప్రయెూగిస్తామన్నారు. అప్పటికి పూర్తి దేశీయ నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. ఏప్రిల్‌లో పీఎస్ఎల్వీ-సీ34 ద్వారా కార్టోశాట్-4సి, తదుపరి పీఎస్ఎల్వీ-సీ35 ద్వారా ఎస్సీసీటీ ఉపగ్రహ ప్రయోగాలు జరుపుతామన్నారు. అనంతరం స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌తో 3వ ప్రయోగంగా ఇన్శాట్-3డీ ప్రయోగం నిర్వహిస్తామని ప్రకటించారు. డిసెంబరులో జీఎస్ఎల్వీ-మార్క్3ని ప్రయోగాత్మకంగా ప్రయోగించే సన్నాహాలలో ఉన్నట్లు చెప్పారు. 2018లో చంద్రయాన్-2 ప్రయోగం జరిపేందుకు ఇస్రో సిద్ధమవుతోందని కున్హికృష్ణన్ చెప్పారు. ల్యాండర్ రోవర్లు బెంగుళూరు ఐఎస్ఏసీ సెంటర్లో తయారవుతున్నాయన్నారు.