Jan 23 2016 @ 00:42AM

బ్రహ్మశ్రీ పరశురామ ఘనాపాఠి కన్నుమూత

చెన్నై, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): కంచి శంకర మఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి వేద పారాయణం చేయించిన గురువు బ్రహ్మశ్రీ పరశురామ ఘనాపాఠి గురువారం స్వర్గస్తులయ్యారు. తన 103వయేట మహాపెరియవ పాదాల చెంత కు చేరిన ఆయన స్వస్థలం తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని ఇంజికొల్లై. రామేశ్వరం దేవస్థాన పాఠశాలలో వేద అభ్యాసం చేశారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాత వేద సభలన్నింటి చేత సత్కారం పొందిన మహా వేదపండితులు. జయేంద్ర సరస్వతి ఆయనకు మొదటి శిష్యులు. తిరువానైక్కావల్‌లోని వేదపాఠశాలలో జయేంద్ర సరస్వతికి వేదపఠనం చేయించారు. కంచి మఠం జూనియర్‌ పీఠాధిపతి విజయేంద్ర సరస్వతికి వేదం నేర్పించారు. చెన్నై శివారులోని అంబత్తూరులో పరశురామన ఘనాపాఠి నివసించారు. ఆయనకు ఐదుగురు సంతానం. దేశంలోనే యజుర్వేదాన్ని ఔపోసన పట్టిన వేద పారాయణుడిగా ఖ్యాతినొందిన పరశురామన.. మాజీ రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌నుంచి ‘పురస్కార్‌’ అవార్డును సైతం అందుకున్నారు.