
ఖైరతాబాద్/హైదరాబాద్, జనవరి 20: రేడియో హనుమంతరావుగా తెలుగు రాష్ర్టాల రైతులకు సుపరిచితుడైన యలమంచిలి హనుమంతరావు(79) మృతి చెందారు. ఎల్లారెడ్డిగూడలోని స్వగృహంలో బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. రైతుల కార్యక్రమాలను రేడియోలో వినసొంపుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. అన్నదాతగా, ఆత్మబంధువుగా, రేడియోరావుగా హనుమంతరావు గుర్తింపు పొందారు. కృష్ణా జిల్లా గన్నవరం తాలూక మేడూరులో 1937లో జన్మించారు. 12 ఏళ్లు వ్యవసాయ శాఖలో పనిచేసిన హనుమంతరావు 1971లో ఆల్ఇండియా రేడియోలో చేరారు.