Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sun, 13 Dec 2015 19:08:20 IST

విఠలాచార్య గారు అప్పుడే చెప్పారు..

విఠలాచార్య గారు అప్పుడే చెప్పారు..

 ‘‘నాకేం తెలుసు సార్‌?’’ అన్నాను. ‘‘మీ జాతకం ఉంటే ఒకసారి ఇవ్వండి ?’’ అని అడిగారాయన. ఇచ్చాను. దాన్ని చూసి ‘‘ఇందులో ఉందండీ. మీరు హీరోగా కూడా ఉండరు. 1980లో శని ఎంటర్‌ అవుతోంది. కొడుతుంది మిమ్మల్ని దెబ్బ. పందొమ్మిదేళ్లు ఇబ్బందులు పడతారు. ఆ తర్వాత బుధ దశలో వచ్చినప్పుడు నిలబడతారు’’ అని చెప్పారు. ఆయన చెప్పడంతో అలర్ట్‌ అయ్యాను. ఎంత ఇమ్మీడియెట్‌ ఎఫెక్ట్‌ అంటే - నలభై అడుగులు యాభై అడుగులు కటౌట్లు పెట్టిన హీరోకు నాలుగు నెలల్లో పోస్టర్లలో ఫోటో లేకుండా పోయింది. ఆయన చెప్పినట్లే జరిగింది. అప్పుడే ఏరియా బిజినెస్‌ మొదలైంది. నా సినిమాలు సక్సెస్‌ కాలేదు. 

ఆర్కే : ఫ్యామిలీని ఎలా నెట్టుకొచ్చారు?
రంగనాథ్‌ : నాకు నలుగురు అన్నదమ్ములు. నెలకు రెండు బస్తాల బియ్యం అయిపోయేవి. ఇటువంటి పరిస్థితుల్లో మరో మంచి అవకాశం కోసం ఎదురుచూడలేను. అప్పుడు హీరో కృష్ణంరాజు గారి వద్దకు వెళ్లాను. ‘‘బ్రదర్‌ ఇలా ఉంది నా పరిస్థితి. ఐ కాంట్‌ వెయిట్‌. ఇప్పుడు నేనేం చేయాలి? విలన్‌ చేస్తే ఎలా ఉంటుంది? ’’ అడిగాను. ‘‘తప్పులేదు. ఏ టైమ్‌లో ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఏమీ చెప్పలేము. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడమే మంచిది. నిజం చెప్పాలంటే హీరోలకంటే విలనే ఎక్కువ సంపాదిస్తాడు’’ అన్నారాయన. కృష్ణంరాజు ఒకసారి నాకు ఫోన్‌ చేసి ‘‘బెంగాలీ పిక్చరు ఒకటి కొన్నాను. తెలుగులో తీస్తున్నాను. ఇందులో నువ్వు విలన్‌ వేస్తే బావుంటుంది? నువ్వు ఒకసారి చూడు’’ అని సినిమాను చూపించారు. అందులోనే నేను విలన్‌గా చేశాను. ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆ తర్వాత - నలభై యాభై సినిమాల్లో విలన్‌గా చేసే అవకాశం వచ్చింది.

ఆర్కే: మీరొక దశలో అందర్నీ ఆకర్షించారు. అప్పుడు ఎలా ఫీలయ్యారు?
రంగనాథ్‌ : నేను ఇప్పటికీ హీరో అనే ఫీలవుతుంటాను. నాలోని హీరోనే నాతో ఈ వేషాలు వేయిస్తున్నాడు అనుకుంటాను. మొన్న ఎవరో అన్నారు ‘మీలో ఇంకా హీరో కనిపిస్తున్నాడు’ అని. అదెక్కడికి పోతుంది. అదే నాకు బేస్‌. నాలో ఆ హీరో ఉన్నాడు కాబట్టే ఇంకా పోరాడుతున్నాడు.

ఆర్కే : వేషాల కోసం ఎవరిని అడిగారు?
రంగనాథ్‌ : ‘ఖైదీగారు’లో నటించిన తర్వాత ఏదో వేడుకకు రేపల్లెకు వెళ్లాల్సి వచ్చింది. రైలు ఎక్కిన దగ్గర నుంచి రేపల్లెలో దిగేదాగా ‘‘ఖైదీగారు’ చూశాం.. మీరు ఏం యాక్టింగ్‌ చేశారు సార్‌. మీరప్పుడప్పుడు సినిమాల్లో కనబడాలి. మీరంత మంచి ఆర్టిస్టు కనిపించకపోతే ఎలా సార్‌’’ అనడం మొదలుపెట్టారు అభిమానులు. వాళ్ల కోరికలో నుంచి ఒక థియరీ వచ్చింది. నేను వ్యక్తి రంగనాథ్‌ అనుకున్నాను. కాని వాళ్లు ఆర్టిస్టు రంగనాథ్‌ అనుకుంటున్నారు. అంటే నాలో ఇద్దరం ఉన్నాం. మరి నేను నన్ను - వ్యక్తి రంగనాథ్‌గా అనుకుంటున్నాను కాబట్టి ఒకరి దగ్గరికి వెళ్లి వేషం అడగటం లేదు. ఆర్టిస్టు రంగనాథ్‌ వెళ్లి అడగాలి కదా? ఎందుకంటే వాళ్లంతా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ వ్యక్తి రంగనాథ్‌ అనేవాడు ఆర్టిస్టు రంగనాథ్‌కు సెక్రెటరీ. వాణ్ణి ప్రమోట్‌ చేయడం వీడి పని అనుకున్నాను. అప్పుడే వెళ్లి ముత్యాల సుబ్బయ్య, ఎస్వీ కృష్ణారెడ్డిలను వేషాలు ఇవ్వమని అడగాల్సి వచ్చింది. అడిగిన వెంటనే వాళ్లు ఇచ్చారు.
(ఇంకా ఉంది)
‘‘విల్‌ గో ఫర్‌ ద నెక్ట్స్‌ షాట్‌’’ రాజమౌళి కోపంతో అంటే... ‘‘ప్యాకప్‌’’ అని ఇంటికి వెళ్లిపోయా.. వివరాలు తరువాతి పేజీలో..

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.