Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sun, 13 Dec 2015 19:07:32 IST

ఫ్రెండ్ లేడని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..

ఫ్రెండ్ లేడని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..

మా భార్యాభర్తలిద్దరికీ ఏవైనా కంప్లయింట్స్‌ ఉంటే అతని చెప్పుకునేవాళ్లం. కొన్నాళ్లకు అతను ఎయిర్‌ఫోర్స్‌కు వెళ్లిపోయాడు. ఇక ఎవరూ లేరే అని బాధ కలిగింది. ఆ సమయంలో ఎందుకో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. తిరుపతి నుంచి 156 ట్రైన్‌ వస్తుందని.. పట్టాల ముందు కూర్చున్నాను. అయితే ట్రైన్‌ రావడం లేటు అయ్యింది. చిన్నప్పటి నుంచి నేను ఆర్టిస్టు కావాలని కోరుకుంది అమ్మ. ఇప్పుడు చచ్చిపోవడం ఏమిటి? అనిపించింది. వెంటనే ఇంటికొచ్చేశాను. 

ఆర్కే : సినిమా ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్‌ లేకుండా నిలదొక్కుకోవడం కష్టం కదా? మీరెలా నిలబడ్డారు?
రంగనాథ్‌ : నేను ఆర్థికంగా సున్నా. అయితే విద్వత్తు ఉంది. మా తాతగారు రాజుగారికి వైద్యునిగా ఉన్నప్పుడు.. అదే రాజుకు తాపీధర్మారావుగారు ట్యూటర్‌గా ఉండేవారు. వాళ్లు అలా పరిచయం అయ్యారు. కన్నాంబ, పుష్పవల్లిలది మా అమ్మమ్మ ఊరైన ఏలూరు. అక్కడ మా అమ్మమ్మకు ఇద్దరు అన్నలు. వాళ్లు హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల్లో విద్వాంసులు. మా అమ్మ జానకి సింగర్‌. తబలాప్లేయర్‌. మా అమ్మమ్మ వీణలో గోల్డ్‌మెడలిస్టు. మా అమ్మ గాయని కావాలనుకునేది. అదే టైమ్‌లో ఎస్‌.జానకి కూడా గాయని అయ్యారు. కొన్ని కారణాల వల్ల అమ్మ కోరిక నెరవేరకపోవడంతో కొడుకునైన నేనైనా ఆర్టిస్టు కావాలనుకుంది.

ఆర్కే : ఆ తర్వాత ఏం చేశారు?
రంగనాథ్‌ : ఒక దశలో - సినిమా పిచ్చి పెట్టుకుని వెళుతూపోతే జీవితం ఏమైపోతుంది? అనుకున్నాను. నేను బీఏ ఇంగ్లీ్‌ష్‌ లిటరేచర్‌ చేశాను. రైల్వే సర్వీస్‌ కమీషన్‌ పరీక్ష రాసి.. టికెట్‌ కలెక్టర్‌ అయ్యాను. అప్పుడు నా వయసు ఇరవై ఏళ్లు. రాజమండ్రిలోనే ఉండిపోయాను. ఉద్యోగంలో చేరిన సంవత్సరానికే పెళ్లి అయ్యింది. వెంటనే పిల్లలు పుట్టారు. ఎంఎస్‌ రెడ్డి గారు ‘కోడెనాగు’ అనే సినిమా తీశారు. ఆ తర్వాత ఆయన తీయబోయే సినిమాలో నటించేందుకు వెళ్లి.. ఆయన్ని కలిసినప్పుడు ‘‘అవును మా ‘కోడెనాగు’ సినిమాకు నటులు కావాలని ప్రకటిస్తే నువ్వెందుకు రాలేదు’ అని అన్నారు. ఏమీ చెప్పలేకపోయాను. రాజమండ్రికి చెందిన ఒక మిత్రుడు ‘‘ఎంఎస్‌రెడ్డి నాకు తెలుసు. నీ ఫోటోలు ఉంటే ఇవ్వు. నేను తీసుకెళ్లి ఇస్తాను’’ అన్నాడు. ‘‘మూడు ఫోటోలు కావాలాయ్యా. ఫోటో అయిదు చొప్పున మూడూ కలిపితే పదిహేను రూపాయలు అవుతాయి. ఆ పదిహేను పెడితే పిల్లకు పాలడబ్బా వస్తుంది’’ అని చెప్పాను.

ఆర్కే : మీ తొలిసినిమా ఎలా మొదలైంది?
రంగనాథ్‌ : ‘బుద్ధిమంతుడు’ నా ఫస్టు పిక్చరు. బాపు తీశారు. అందులో అవకాశం ఎలా వచ్చిందంటే - మా ‘వీణాపాణి’ బ్యానర్‌లో ఒకతను పనిచేసేవాడు. అతనికి ‘సుజనరంజని’ అనే సొంత ట్రూపు ఒకటుండేది. ‘టాటా వీడుకోలు’ పాట కోసం ‘‘మద్రాసు నుంచి ఆర్కెస్ట్రా వాళ్లను ఎందుకు తీసుకురావడం. స్థానికంగా ఉండే వాళ్లను తెచ్చుకుందాం’’ అనుకున్నారేమో సుజనరంజనికి కబురు చేశారు. స్ర్కీన్‌ మీద ఎలా ఉంటానో చూసుకుందామని నేను కూడా వాళ్లతో కలిసి వెళ్లాను. షూటింగ్‌లో ఆర్కెసా్ట్ర మీద షూట్‌ చేస్తున్నారు. నేను ఫ్లూట్‌ పెట్టుకుని నిలబడ్డాను. ఆ సినిమాలో నన్ను క్లోజప్‌లో చూపించారు. నేను నచ్చడంతోనే బాపుగారు తీస్తున్న ‘అందాలరాముడు’లో స్థలపురాణం ఉందని రాముడు వేషానికి పిలిచారు. అదే టైమ్‌లో గిరిబాబు నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలని చూస్తున్నారు. అప్పుడు నేను వెళ్లి రమణగారికి పరిస్థితి చెప్పాను. ఆ టైమ్‌లో హీరోగా మిస్‌ అయ్యాను. ఆ తర్వాత రెండు సినిమాలు చేజారిపోయాయి. ‘ఇద్దరూ ఇద్దరే’లో కృష్ణంరాజు నటించి పైకొచ్చారు. ‘భారతంలో అమ్మాయి’లోనేమో మురళీమోహన్‌ హీరోగా చేసి క్లిక్‌ అయ్యారు.
(ఇంకా ఉంది)
‘మీరు హీరోగా ఉండరు..పందొమ్మిదేళ్లు ఇబ్బందులే’...విఠలాచార్య చెప్పిందే నిజమైంది.. వివరాలు తర్వాతి పేజీలో..

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.