Dec 11 2015 @ 12:29PM

విలువ తగ్గిపోతోంది

చిన్న వయస్సులోనే పాటల పల్లకీ ఎక్కి.. హేమా హేమీలతో కలిసి ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన గాయనీగాయకులు గోపికా పూర్ణిమ, మల్లికార్జున్‌. స్వర మాంత్రికుడు ఎస్వీ బాలసుబ్రమణ్యం ప్రియశిష్యులైన వీరిద్దరూ.. ఒకే సినిమాలో, ఒకే పాటతో సినీరంగంలోకి అడుగిడి.. ప్రేమ, పెళ్లితో ఒక్కటయ్యారు. వారితో 10-9-12న జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమం విశేషాలు.


ఇద్దరూ గాయకులే కదా.. ఇంట్లోనూ పాడతారా?
గోపిక/మల్లి: కోపమొచ్చినా పాటే, ఆనందం వచ్చినా పాటే. మాకు తోచిన ట్యూన్‌లో మాటలే పాటగా మా ర్చేస్తాం. ఆ సందర్భానికి తగ్గట్టుగా పాటల రూపంలో వ చ్చేస్తాయి. తిట్లలాంటివి కూడా ట్యూన్‌లోనే ఉంటాయి.

మీది ప్రేమ వివాహం కదా..
గోపిక: పాడుతా తీయగా సెట్స్‌లో మా పరిచయం. అప్పుడు నేను తొమ్మి దో తరగతి చదువుతున్నా. తర్వాత మా కుటుంబం చెన్నై వెళ్లిపోయాం. ఓ ప్రొగ్రామ్‌కు బాలసుబ్రమణ్యం పిలవడంతో చెన్నై వచ్చిన మల్లి.. అక్కడే ఉండిపోయాడు. చాలా కాలం స్నేహితుల్లానే ఉన్నాం.
మల్లి: అప్పుడు ప్రేమ అనేదేం లేదు. అవకాశాల కో సం చెన్నై వెళ్లాను. మేం ప్రోగ్రామ్స్‌లోనో, స్టూడియోల్లో, సరాసరి ఇంట్లోనో కలవడం అంతే. మా విషయం తల్లిదండ్రులకు తెలిశాక కొంత క్లాషెస్‌ వచ్చాయి.

పెళ్లికి పెద్దలు ఎప్పుడు అంగీకరించారు?
గోపిక: దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఇంట్లో వా ళ్లు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇంట్లో వాళ్లు ఓకే చెప్పిన రోజునే బాలు నాకొక ఎన్నారై సంబంధం తె చ్చారు. దాంతో.. మా ప్రేమ విషయం మా అమ్మే బాలుగారికి చెప్పింది.
మల్లి: ఈ విషయం తెలియగానే బాలు నాకు ఫోన్‌ చేశారు. ‘దొంగ భడవా’ ఇంతకాలం నాతో కలిసి ప్రోగ్రా మ్స్‌ చేశారు. దేశ విదేశాలకు తిప్పాను. నాక్కూడా తెలియకుండా భలే మేనేజ్‌ చేశారే? అన్నారు.

సినిమా అవకాశాలు?
గోపిక/మల్లి: మేం ఇద్దరం ఒకే సినిమాలో.. ఒకే పా టతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాం. అది సింగ న్న సినిమాలో ‘అన్న వెనకే నేను ఉంటా..’ అనే పాట. బాలు మొదటి సారిగా పాడిన స్డూడియోలోనే మేం కూడా తొలిసారి పాడాం. అది మరపురాని అనుభవం.

బాలుకు మీపై ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకు?
మల్లి/గోపిక: మేమిద్దరం మాత్రమే కాదు. ఆ బ్యాచ్‌ లో పార్థసారథి, ఉష, నిత్యలను కూడా బాలు చాలా ప్రో త్సహించేవారు. ఆయన మాకు దేవుడికంటే ఎక్కువ.

(ఇంకా ఉంది)
గాయకుల్లో గ్యాంగ్‌వార్‌ను ఎలా ఎదుర్కొంటున్నారు?... వివరాలు తరువాతి పేజీలో...