
- శ్వాసకోశ వ్యాధితో ఆస్పత్రిలో కన్నుమూత
- ప్రధాని మోదీ, వెంకయ్య, దత్తన్న నివాళి
న్యూఢిల్లీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): విశ్వహిందూ పరిషత(వీహెచ్‌పీ) మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ (89) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో ఆయన గుర్గావ్లోని ఒక ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం రెండున్నరకు తుదిశ్వాస విడిచారని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా తెలిపారు. శ్వాసకోశ సంబం ధిత వ్యాధితోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడు తున్న ఆయన్ని శనివారం ఆస్పత్రిలో చేర్పించి ప్రత్యేక నిపు ణులు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. సింఘాల్ బ్రహ్మచారి. ఆయన మృతిపై ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు వెంకయ్య, బండారు దత్తాత్రేయ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. సింఘాల్ మరణం తనను ఎంతో కలచివేసిందని, వ్యక్తిగతంగా ఎంతో కోల్పోయానని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. హిందువుల ఐక్యత కోసం ఆయన అహరహం కృషి చేశారని వెంకయ్య నివాళి ఘటించారు.
ఇంజనీరింగ్ నుంచి హైందవ ధర్మ రక్షణకు
భారతలోనే కాదు, దేశవిదేశాలలోని హిందువులకు సింఘాల్ నిత్యస్ఫూర్తి. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం 30 ఏళ్లుగా దేశవ్యాప్తంగా వీహెచ్‌పీ నిర్వహించిన ఆందోళనలలో హిందువులపై ఆయన చూపించిన ప్రభావం అచంచలమైనది. అయోధ్యలో ‘భవ్య’రామమందిర నిర్మాణం కోసం ఆయన జీవితాన్నే ధారబోశారు. చదువుకునే రోజుల్లో నే సింఘాల్ ఆరెస్సెస్ ప్రచారక్‌గా ప్రస్థానం ప్రారంభించా రు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కొనసాగుతు న్న సమయంలో దేశవ్యాప్తంగా హిందువులలో చైతన్యం నిం పడంలో ఆయన ప్రదర్శించిన దూకుడు అటు కాంగ్రెస్‌నూ, ఇటు వామపక్షాలనూ రాజకీయంగా ఆత్మరక్షణలో పడేసింది. 1926 అక్టోబరు 2న అగ్రాలో పుట్టిన అశోక్.. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెటలర్జిక ల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీచేశారు. చిన్ననాటే ఆరెస్సెస్ భావ జాలం పట్ల ఆకర్షితులైన ఆయన 1942లోనే ఆ సంస్థలో చేరి ఇంజనీరింగ్ పూర్తయ్యాక పూర్తిస్థాయి ప్రచారక్‌గా మారి యూపీలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా యూపీ లో పెద్దఎత్తున ఉద్య మం మొదలుపెట్టి జైలుకెళ్లారు. ఢిల్లీ, హ ర్యానాలో ఆరెస్సెస్ ప్రాంత ప్రచారక్ బా ధ్యతలు నిర్వర్తిం చారు. 1980లో ఆయ న వీహెచ్‌పీ సంయు క్త ప్రధాన కార్యదర్శి గా నియమితులై 1984లో ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. అనంతరం సింఘాల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి 2011 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన మంచి గాయకుడు కూడా. పండిత ఓంకార్‌నాథ్ ఠాకూర్ వద్ద హిందూస్థానీ గాత్ర సంగీతం నేర్చుకున్నారు. తమిళనాడులోని మీనాక్షీపురంలో 1981లో వందలాదిమంది దళితులు ఇస్లాం తీసుకున్న సంఘటనలు హిందూ సమాజంలో కలకలం రేపగా, ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు సింఘాల్ రంగంలోకి దిగారు. దళితుల కోసం సింఘాల్ నేతృత్వంలో వీహెచ్‌పీ ప్రత్యేకంగా 200 గుడులు నిర్మించి వారిచేత ఆలయ ప్రవేశాలు చేయించింది. దీని తర్వాత మతమార్పిడులు ఆగిపోయాయని ఆ సంస్థ పేర్కొం ది. 1984లో ఢిల్లీలో సింఘాల్ ఆధ్వర్యంలో తొలి ‘ధర్మ సంసద్’ జరిగింది. అక్కడి నుంచి రామజన్మ భూమి ఉద్యమం వేడెక్కి అయోధ్యవైపు అడుగులు పడ్డాయి. సింఘాల్ నేతృ త్వంలోని కార్సేవకులు 1992 డిసెంబరు ఆరున అయోధ్య లోని బాబ్రీ మసీదును కూల్చివేశారు. రామాలయ ఉద్యమం తోపాటు గోరక్షణ ఆందోళనలో తమకు స్ఫూర్తినిచ్చిన సింఘాల్‌ను వీహెచ్‌పీ నేతలు మార్గ దర్శిగా, దార్శనికుడుగా భావిస్తారు. ఆయన హయాంలో 40 దేశాల్లో వీహెచ్‌పీ శాఖ లు ప్రారంభమ య్యాయి. హైందవ ధర్మ పరిరక్షణ కోసం తన యావజ్జీవితాన్ని ధారబోసిన సింఘాల్.. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం తన చిరకాల స్వప్నమని గతంలో అనేకసార్లు ప్రకటించారు.