Oct 3 2015 @ 12:27PM

దెబ్బ తింటున్న కోట సాక్షిగా చరిత్ర శిథిలమవుతోంది...

నల్గొండ, రాజాపేట : నాటి సంస్కృతికి అద్దం పట్టే కట్టడం అది. చరిత్రకు ఆనవాళ్లుగా మిగలాల్సింది. నేడు శిథిలావస్థకు చేరుతోంది. రాజాపేట మండల కేంద్రంలోని రాజాపేట కోట శిథిలమైపోతుంది. 1775లో రాజరాయన్న ఈ కోటను గ్రామం చుట్టూ నిర్మించాడు. ఐదెకరాల్లో సైనిక పహారా, మూడెకరాల్లో రాణి మహల్‌, కొలను, ఏనుగుల బావి, ఎనిమిది ఎకరాల్లో 24 బురుజులను నిర్మించాడు. మొత్తం 52 ఎకరాల్లో కోట విస్తీర్ణం కలిగింది. కోట లోపల రాణి మహల్‌, కొలను, పోచమ్మ గుడి, ఏనుగుల బావి, ధాన్యాగారం, సొరంగమార్గం, సైనిక పహరా తదితర నిర్మాణాలు ఉన్నాయి. ఏతైనా ప్రాకారాలతో కలిగి ఉంది. 3 వైపుల ద్వారాలను ఏర్పాటు చేశారు. నాటి సాంకేతికతకు నిర్మాణాలకు, కళాత్మకతకు అద్దం పడుతున్నాయి. బురుజులపై, కోట ద్వారాలపై కంప చెట్లు నిండిపోయి పగుళ్లతో శిథిలమై కూలిపోతున్నాయి.
 
కోటను కాపాడాలి : కుందూరు శ్రీనివాస్‌, గ్రామస్థుడు
200 సంవత్సరాల చరిత్ర కలిగిన రాజాపేట కోటను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా ప్రకటించి కోటకు మరమ్మతులు చేపట్టాలి.