Jul 18 2015 @ 13:13PM

యన్టీఆర్ కు అనేక చిత్రాల్లో తల్లిగా నటించిన హేమలత

నటి హేమలత నాటకరంగంలోనూ, రేడియోల్లోనూ తనదైన బాణీ పలికించిన తరువాతే చిత్రసీమలో ప్రవేశించారు... యన్టీఆర్ హీరోగా తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో రూపొందిన 'పల్లెటూరు' చిత్రంతో హేమలత సినిమారంగంలో అడుగు పెట్టారు... అప్పటి నుంచీ యన్టీఆర్, ఏయన్నార్ వంటి అగ్రకథానాయకుల చిత్రాల్లో తల్లి పాత్రలు పోషిస్తూ వచ్చారామె...ముఖ్యంగా యన్టీఆర్ నటించిన పలు చిత్రాల్లో ఆయనకు తల్లిగా నటించి అలరించారు హేమలత... అనేక చిత్రాల్లో సాధుమూర్తిగా నటించిన హేమలత 'బలిపీఠం' వంటి చిత్రాల్లో గయ్యాళి పాత్రలూ పోషించారు... ఎన్నో సినిమాల్లో మాతృమూర్తిగా నటించి అలరించిన హేమలత అనితరసాధ్యమైన అభినయంతో ఆకట్టుకున్నారు...