Jun 22 2015 @ 01:09AM

అంగర సూర్యారావుకు బలివాడ పురస్కారం

కథకునిగా, నాటక రచయితగా, వ్యాసకర్తగా, ఉత్తరాంధ్ర సాహిత్యంలో అగ్రగణ్యులు అంగర సూర్యారావు. ఆయన సమగ్ర విశాఖ నగర చరిత్ర రచించిన బహుముఖ సాహతీవేత్త. బలివాడ కాంతారావు స్మారక జయంతి సభ పురస్కరించుకుని విశాఖ రచయితల సంఘం, విశాఖ సంస్కృతి మాసపత్రిక సంయుక్త నిర్వహణలో, భారతనిధి చారిటబుల్‌ట్రస్ట్‌ సౌజన్యంతో బలివాడ కాంతారావు పురస్కారానికి అంగర సూర్యారావుని ఎంపిక చేయడం జరిగింది. జూలై 3న విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగే సాహతీ సభలో నగదు, శాలువా, ప్రశంసాపత్రంతో సూర్యారావుకు సత్కారం జరుగుతుంది.

- అడపా రామకృష్ణ
విశాఖ రచయితల సంఘం