Jun 16 2015 @ 04:23AM

కాచారంలో ఆదిమ మానవుల ఆనవాళ్లు

యాదగిరిగుట్ట రూరల్‌, జూన్‌ 15: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారంలో ఆదిమ మానవుడి ఆనవాళ్లు వెలుగుచూశాయి. చరిత్ర పరిశోధకులు విరువంటి గోపాలకృష్ణ, శ్రీరామోజు హరగోపాల్‌లు సాగించిన పరిశోధనల్లో ఆదిమ మానవులు ఉపయోగించిన పరికరాలు బొరిగే రాయి, గొడ్డలి, పెచ్చురాళ్లు, మెన్వర్లు బయటపడ్డాయి. ఆలేరు నదీలోయ ప్రాంతం దక్కన్‌ పీటభూమిలో అగ్ని పర్వతాల నుంచి వచ్చిన లావా వల్ల ఏర్పడ్డ ఆర్కియన్‌ ప్రాచీన యుగం నాటి రాళ్లు, క్వాండరైట్‌, క్వార్ట్‌, గ్రానైట్‌ అవక్షేప శిలలు ఏర్పడ్డాయి. కాచారంలో ప్రాచీన శిలాయుగం నుంచి కొత్త రాతియుగం వరకు ద్రావిడ కాలంలో పెద్దగుట్ట దగ్గర పలు ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ప్రాచీన కాలంలో ఆదిమ మానవులు తమ సమాధుల వద్ద మెన్వర్లను గుర్తుగా ఏర్పాటు చేసుకున్నారని ఈ సందర్భంగా పరిశోధకులు తెలిపారు. వాటిని మరుగున పడకుండా ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.