Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 06 Jun 2015 16:52:53 IST

జయమాలిని కోసం మరో 3 కేజీలు తగ్గే ప్రయత్నంలో..

జయమాలిని కోసం మరో 3 కేజీలు తగ్గే ప్రయత్నంలో..

హీరోయిన్ ఓరియెంటెడ్ "జంక్షన్‌లో జయమాలిని" చిత్రం కోసం బరువు తగ్గడానికి ఆర్తి చేసిన ప్రయత్నమే ఆమెకు ప్రాణాంతకంగా మారిందా? ఈ ప్రశ్నకు జవాబు అవుననే వస్తోంది. ఈ సినిమాలో తను డ్యూయెల్ రోల్‌లో నటించేందుకు రంగం సిద్ధమైంది. ఇందులోని ఒక పాత్రలో మాస్ ఇమేజ్ కోసం ఆర్తి వెయిట్ తగ్గాల్సి వచ్చింది. అప్పటికి 89 కేజీల బరువున్న ఆర్తి 63 కేజీలకు వచ్చింది. మరో మూడు కేజీల బరువు తగ్గడం కోసం లైపో సెక్షన్ చేయించుకోవడానికి ఆమె తన జన్మస్థలమైన అమెరికాలోని న్యూజెర్సీ నగరానికి వెళ్లింది. జూన్ 20న తిరిగివస్తానని, షూటింగ్ పెట్టుకోమని నిర్మాతలకు ఫోన్ చేసి చెప్పింది. అంతలోనే ఈ ఘోరం జరిగింది.
 
అమరావతి క్రియేషన్స్‌, శ్రీ పుష్పాంజలి క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించే "జంక్షన్‌లో జయమాలిని" చిత్రానికి శివనాగు దర్శకుడు. ఈ సినిమా గురించి నిర్మాతలు కె.శ్రీకాంత్‌రెడ్డి, జి.నాగేశ్వరరావు, కె.ఎల్‌.రావు వివరాలిస్తూ ప్రముఖ నవలా రచయిత చల్లా సుబ్రహ్మణ్యం రాసిన ‘కేబరే డాన్సర్‌’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఆర్తి అగర్వాల్‌ ద్విపాత్రాభినయం చేస్తోందని, నాగార్జున హిట్ చిత్రం ‘హలో బ్రదర్‌’ తరహాలో క్లాస్‌, మాస్‌ పాత్రల్లో రొమాంటిక్‌, కామెడీ టచ్‌తో ఇంతవరకూ చేయని పాత్రలు ఆర్తీ చేయబోతోందని చెప్పారు. అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే ఈ నెలలోనే షూటింగ్ మొదలు కావలసి ఉంది.
 
ఆర్తి తాజా చిత్రాల విషయానికి వస్తే... తను నటించిన రణం-2 శుక్రవారం విడుదలైంది. "ఆపరేషన్ గ్రీన్ హంట్ " విడుదల కావాల్సి ఉంది.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.