May 30 2015 @ 19:45PM

సీఎం చేస్తున్న అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరా
స్పష్టం చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

హైదరాబాద్‌, మే 30: తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశానని టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరానని చెప్పారు. కూకట్‌పల్లి నియోజకవర్గం అభివృద్ధి తన ధ్యేయమని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌ తనను ఎంతగానో ప్రోత్సహించారని, వారిపట్ల తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని అన్నారు. శనివారం నాడు ఎమ్మెల్యే కృష్ణారావు సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.