Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sun, 02 Feb 2020 15:32:47 IST

మాజీ ఎంపీ నారాయణరెడ్డి కన్నుమూత

మాజీ ఎంపీ నారాయణరెడ్డి కన్నుమూత

హైదరాబాద్: నిజామాబాద్ మాజీ ఎంపీ నారాయణ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. రాష్ట్ర చెరుకు రైతు సంఘానికి అధ్యక్షుడిగానూ ఆయన సేవలు అందించారు. 1967 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన ఆయన.. 67-71 మధ్య నాలుగేళ్లు ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు.
 
నారాయణ రెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ కవిత ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. పార్లమెంటులో తెలంగాణ కోసం గళం వినిపించి.. ప్రజల మనుస్సులో నిలిచిపోయారంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మహిళల కోసం జిల్లాలో తొలి కళాశాలను స్థాపించిన గొప్ప అభ్యుదయవాదని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.