Sep 16 2014 @ 00:11AM

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు


మంచిర్యాల టౌన్‌ : మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టి ఏరియాకు చెందిన ఓ మాతృమూర్తి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం పిల్లలు ఆరోగ్యం గా ఉన్నారు. ఇందులో ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగ పిల్లవాడు. రాయుడు భారతి ఈనెల 5న కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డెలివరీ కాగా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆదివారం కరీంనగర్‌ నుంచి మంచిర్యాలకు రావడంతో కాలనీవాసులు చిన్న పిల్లలను చూసేందుకు పెద్ద సంఖ్యలో వారింటికి వెళ్లారు. గుంటూరుకు చెందిన రాయుడు నాగరాజు, భారతిలు మూడేండ్ల కిందట వివాహం చేసుకున్నారు. నాగరాజు పట్టణంలో హౌస్‌వైరింగ్‌, ఎలకీ్ట్రషియన్‌ పనులు చేస్తూ ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. తొలికాన్పులోనే ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడంతో ఆ దంపతులు ఆనందంతో ఉన్నారు. 9