Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sun, 14 Sep 2014 02:45:53 IST

కార్యకర్తలకు అండగా ఉంటాం

 కార్యకర్తలకు అండగా ఉంటాం


శాంతిపురం: అధికారంలో ఉన్నా, లేకపోయినా వెన్నంటి ఉండి పార్టీ అభివృద్ధికి సహకరించి అధికారాన్నందించిన కార్యకర్తలకు అండగా ఉండి, వారి అభి వృద్ధికి కృషి చేస్తామని టీడీపీ మండల అధ్యక్షుడు చలపతి అన్నారు. శనివారం స్థానిక లక్ష్మీనారాయణస్వామి కళ్యాణ మండపంలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా పార్టీకి అండగా ఉంటూ అధికారం ఇచ్చిన కార్యకర్తలను జీవితకాలం మరువలేమన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇప్పటికే పరిశ్రమలకు, ఎయిర్‌ పోర్టుకు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సర్వేలు నిర్వహించారన్నారు. మిగిలిన పనులు త్వరగా పూర్తిచేసి ఇక్కడి యువతకు, కార్యకర్తలకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. అంతేకాక వ్యవసాయ రంగం అభివృద్ధికి కూడా కొత్తరకంగా సాగు విధానాలకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. సీఎం వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో మెజారిటీ తగ్గడానికి గల కారణాలను కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక 2004, 09, 14 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలపై మెజారిటీ వ్యత్యాసాలను తెలుపుతూ ముద్రించిన కరపత్రాలను కార్యకర్తలు పంచిపెట్టి, అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాసివ్వాలని తెలిపారు. అనంతరం పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ మెజారిటీ తగ్గడానికి శాంతిపురం మండలంపై పలువురు నేతలు వివక్ష చూపడమే కారణమన్నారు. దీనిపై నాయకులు స్పందిస్తూ అలాంటిదేమి లేదని, అభివృద్ధిలో అన్ని మండలాలకు సమన్యాయం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సీడీసీఎంఎస్‌ ఛైర్మెన్‌ శ్యామరాజు, ఎంపీపీ పుష్పానారాయణస్వామి, వైస్‌ఎంపీపీ నందిగం ఉదయ్‌కుమార్‌, జడ్పీటీసీ శకుంతల శ్రీనివాసులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.