Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sun, 14 Sep 2014 01:04:25 IST

తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ఆరోగ్యసేవలు మెరుగుపరుస్తాం డిప్యూటీ సీఎం రాజయ్య
వేములవాడ టౌన్‌, సెప్టెంబర్‌ 13 : జై తెలంగాణ అన్న ప్రతి బిడ్డ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం రాజయ్య పిలుపునిచ్చారు. శనివారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ నాయకత్వంలో వంద రోజుల పాలనను సమర్థవంతంగా పూర్తి చేసుకున్నామని, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి అంశాన్ని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకెళ్తున్నారన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్దికోసం 200 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని అందించేందుకు కృషి చేస్తామన్నారు.ప్రాథమిక కేంద్రాల్లో కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం తాటి కొండ రాజయ్య తెలిపారు. కరీంనగర్‌ మండలం బొమ్మకల్‌లోని చల్మెడ ఆనందరావు వైద్యకళాశాలలో నిర్వహిస్తున్న ఈఎన్‌టి రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. మండల కేంద్రాల్లో 100 పడకలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 30 పడకలతో కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
జూ ఉనికి కోసమే కాంగ్రెస్‌ వీధినాటకాలు..!: ఎంపీ కడియం శ్రీహరి
లింగాలఘణపురం: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ తన ఉనికి కోసమే చౌకబారు విమర్శలకు పాల్పడుతూ.. వీధి నాటకాలాడుతుందని వరంగల్‌ ఎంపీ కడియం శ్రీహరి విమర్శించారు. వరంగల్‌ జిల్లా లింగాలఘణపురం మండలంలో శనివారం పర్యటించిన ఎంపీ.. వడ్డిచర్లలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్‌ సంక్షోభానికి కాంగ్రెస్‌ అసమర్థ పాలనే కారణమని, వాళ్ల నిర్వాకం వల్లే ప్రస్తుతం రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రైతుల ఇబ్బందుల ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంపై రూ.19వేల కోట్ల భారం పడుతున్నా కేసీఆర్‌ రుణమాఫీ పథకం కోసం ముందుకు వచ్చారని ఎంపీ అన్నారు. రుణమాఫీ కోసం ఆర్‌బీఐ అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తుందన్నారు. అధికారుల విభజన జరగకుండా ప్రభుత్వ పథకాలు ఏరకంగా అమ లౌతాయో పదేళ్లుగా మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య తెలపాలన్నారు.
జూ పొన్నాల... డ్రామా కంపెనీ హెడ్‌: ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌
మహబూబ్‌నగర్‌ అర్బన్‌ : అరవై ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌... రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసిందని, వంద రోజులైనా పూర్తి చేసుకోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుజేసేందుకు కాంగ్రెస్‌ నేతలు డ్రామా ఆర్టిస్టుల్లా పత్రికలకు ఫోజులిస్తూ ధర్నాలు చేస్తున్నారని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. ఈ డ్రామా కంపెనీకి పీసీసీ అద్యక్షులు పొన్నాల లక్ష్మయ్య హెడ్‌ అని విమర్శించారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జూ అధికారులు చక్కగా పని చేశారు ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి
రామాయంపేట: ప్రస్తుత ఉప ఎన్నికలో అధికారులు చక్కగా విధులు నిర్వర్తించారని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.ఆమె శనివారం రామాయంపేట మండలంకోనాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు.పోలీసులు కూడా ముం దు జాగ్రత్త చర్యగా పోలింగ్‌ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేశారన్నారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.