
ఇఫ్తార్ విందు వంటకాలు నోరూరిస్తాయి. రుచితోపాటు పోషకాలు కూడా సమృద్ధిగా ఉండే ఇఫ్తార్ వంటలను రుచి చూడాలని ఉందా? అయితే ఈ స్పెషల్ రెసిపీలను ట్రై చేయండి.
వెజిటేరియన్ హలీం కావలసిన పదార్థాలు:వేయించిన ఉల్లి ముక్కలు - అర కప్పు
ఉప్పు - తగినంత, అల్లం
వెల్లుల్లి పేస్ట్ - 1 టే.స్పూనుపాలు - 1 కప్పు, పచ్చిమిర్చి - 2
నెయ్యి - 2 టే.స్పూన్లు
గోధుమ రవ్వ - అర కప్పు
ఓట్స్ - పావు కప్పు, శనగపప్పు - 1 టీస్పూను
పెసర పప్పు - 1 టీస్పూను
మినప్పప్పు - 1 టీస్పూను
చాయ పప్పు - 1 టీస్పూను
జీలకర్ర - 4 గ్రా, నువ్వులు - 3 గ్రా
లవంగాలు - 2 గ్రా
మిరియాలు - 3 గ్రా
దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క
యాలకులు - 8, షా జీరా - 2 గ్రా
కబాబ్ చీనీ - 2 గ్రా
పెరుగు - 2 టే.స్పూన్లు, కొత్తిమీర
పుదీనా తరుగు - గుప్పెడు
జీడిపప్పు - 20 గ్రా, పిస్తా - 20 గ్రా
బాదం - 20 గ్రా, సోయా బీన్ నగెట్స్ - 100 గ్రా
తయారీ విధానం:- సోయా నగెట్స్ ఉడికించి ముద్దగా నూరాలి.
- ఓ గిన్నెలో కబాబ్ చీనీ, షా జీరా, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, పప్పులు, నువ్వులు, లవంగాలు, ఓట్స్, గోధుమ రవ్వ వేసి బాగా కలుపుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి.
- కుక్కర్లో నెయ్యి వేడిచేసి జీడిపప్పు, బాదం, పిస్తా, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
- తర్వాత ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, సోయా ముద్ద వేసి వేయించాలి.
- తర్వాత పాలు, ఉప్పు, నీళ్లు పోసి కలిపి, మసాలా, పప్పుల పొడి వేసి ఉడికించాలి.
- మరిగాక చిన్న మంట మీద మరో 15 నిమిషాలు ఉడికించాలి.
- తర్వాత ఉడికిన హలీంను బాగా మెదిపి నిమ్మరసం, ఉప్పు వేసి కలపాలి.
- తరిగిన కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించి సర్వ్ చేయాలి.
లఖ్మికావలసిన పదార్థాలు:
మైదా - అర కిలో
నీళ్లు - 140 మి.లీటర్లు
నెయ్యి 10 గ్రా, ఉప్పు - తగినంత
నూనె - అర లీటరు
స్టఫింగ్ కోసం:
ఖీమా - 100 గ్రా
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 5 గ్రా
జీలకర్ర పొడి - 5 గ్రా
పసుపు - 5 గ్రా
గరం మసాలా పొడి - 5 గ్రా
పుదీనా తరుగు - 20 గ్రా
అల్లం, వెలుల్లి పేస్ట్ - 10 గ్రా
తయారీ విధానం:- పిండికి నీళ్లు, ఉప్పు, నూనె చేర్చి ముద్దగా పిసుక్కోవాలి.
- ఖీమాకు మిగతా పదార్థాలన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి.
- పిండి 2 మి.మీటర్ల మందంగా ఒత్తుకుని 4 సె.మీ పొడవు, 2 సె.మీటర్ల వెడల్పు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఈ ముక్కల్లో ఖైమా మిశ్రమాన్ని ఉంచి అంచులు అంటించాలి.
- బాండీలో నూనె వేడిచేసి తయారుచేసిపెట్టుకున్న లఖ్మిలను బంగారు రంగుకు వేయించుకోవాలి.
చికెన్ పకోడా కావలసిన పదార్థాలు:
చికెన్ - పావు కిలో, అల్లం
వెల్లుల్లి పేస్ట్ - 50 గ్రా
పసుపు - 10 గ్రా, కారం - 10 గ్రా
నిమ్మరసం - 1 టీస్పూను,
నీరోడ్చిన పెరుగు - 100 గ్రా
నూనె - అర లీటరు, ధనియాల పొడి - 10 గ్రా
ఉప్పు - తగినంత
గరం మసాలా - అర టీస్పూను
వేపుడుకు :
గుడ్డు పచ్చసొన - 1
ఉప్పు - రుచికి సరిపడా
శనగపిండి - 50 గ్రా
బ్రెడ్ ముక్కలు - 50 గ్రా
తయారీ విధానం:- గిన్నెలో చికెన్ ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, నిమ్మరసం, పెరుగు, గరం మసాలా, ఉప్పు, ధనియాల పొడి వేసి కలుపుకుని అరగంటపాటు పక్కనుంచాలి.
- తర్వాత చికెన్ ముక్కలను 10 నిమిషాలపాటు గ్రిల్ చేయాలి.
- ఉడికిన ముక్కలను కట్ చేసి పక్కనుంచాలి.
- గిన్నెలో శనగపిండి, గుడ్డు సొన, ఉప్పు, బ్రెడ్ ముక్కలు, తరిగిన చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి.
- బాండీలో నూనె వేడి చేసి పకోడీల్లా వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకోవాలి.