ఏబీఎన్ సెల్ఫీ క్యాంపైన్‌లో పాల్గొనండి.. కరోనాకు చెక్ పెట్టండి!

ABN , First Publish Date - 2020-03-25T18:41:29+05:30 IST

దేశమంతా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. కోవిడ్‌-19(కరోనా వైరస్)‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాయి.

ఏబీఎన్ సెల్ఫీ క్యాంపైన్‌లో పాల్గొనండి.. కరోనాకు చెక్ పెట్టండి!

హైదరాబాద్: దేశమంతా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. కోవిడ్‌-19(కరోనా వైరస్)‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ప్రధాని మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో ఎక్కడివాళ్లు అక్కడే గప్‌చుప్ అన్నట్టు ఉండిపోయారు. ప్రభుత్వ ఆదేశాలు కాదని బయటకు రావద్దనీ.... షూట్ ఎట్ సైట్‌ ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇంట్లోనే ఉండేలా ప్రసారమాధ్యమాలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. 


అందులో భాగంగా ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’  వినూత్నంగా ఓ సెల్ఫీ క్యాంపైన్ చేపట్టింది.  ‘‘ఇంట్లోనే ఉందాం.. దేశాన్ని కాపాడుకుందాం’’ అనే నినాదంతో ఈ క్యాంపైన్‌కు శ్రీకారం చుట్టింది. ఈ క్యాంపైన్‌లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు... అందరూ పాల్గొనొచ్చు. ఇంట్లోనే ఉన్నట్లుగా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేయాల్సి ఉంటుంది.. ఇంట్లో ఉంటూ ఏదైనా పనిచేస్తున్నా కూడా ఆయా సెల్ఫీలను సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేయొచ్చు.. వీటిని పోస్ట్ చేసేటప్పుడు #ABNSelfieQuarantine అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేస్తే.. వాటిని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియాలో ప్రసారం చేస్తాం.

Updated Date - 2020-03-25T18:41:29+05:30 IST