LIVE: ఏపీలో ఇళ్ల స్థలాల రగడ

ABN , First Publish Date - 2020-07-06T13:19:39+05:30 IST

LIVE: ఏపీలో ఇళ్ల స్థలాల రగడ

LIVE: ఏపీలో ఇళ్ల స్థలాల రగడ

అమరావతి: ఏపీలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన రగడ కొనసాగుతోంది. 28లక్షల మంది లబ్దిదారులకు రేపు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో తాము కట్టిన 12లక్షల ఇళ్ల సంగతి ఏంటి అంటూ టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే పూర్తి అయిన ఇళ్లను ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎందుకు ప్రభుత్వం తాత్సారం చేస్తోంది?...ఇళ్ల బిల్లులు ఇవ్వకుండా ఎందుకు వేధిస్తోందని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇదే అంశంపై నేడు, రేపు టీడీపీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతోంది. ఈరోజు ప్రధానంగా గతంలో కట్టిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని...వాళ్లకు ఇవ్వాల్సిన బిల్లులను వెంటనే మంజూరు చేయాలనే అంశంపై నిరసన చేయనుంది.


అలాగే  28లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న ఇళ్ల స్థలాల్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని, చాలా నియోజకవర్గాల్లో మార్కెట్ ధర కంటే దాదాపు నాలుగైదు రెట్లు అధికంగా డబ్బులు చెల్లించి భూములు కొనుగోలు చేశారని... భూమికి సంబంధించి, ఇళ్ల స్థలాలకు సంబంధించి లబ్ధిదారుల వద్ద డబ్బులు అదనంగా వసూలు చేశారని... అంతేకాకుండా పనికిరాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని... లబ్ధిదారుల ఎంపికలో చాలా అవకతవకలు జరిగాయనే అంశాలపై రేపు నియోజకవర్గ కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో వర్చ్యువల్‌గా నిరసనలు తెలిపాలని టీడీపీ నిర్ణయించింది. ఈ స్థలాల రగడకు సంబంధించి ఈ రోజు ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చర్చ చేపట్టారు. ఈ చర్చలో బీజేపీ నేత కర్నాటి ఆంజనేయరెడ్డి, టీడీపీ నేత శివరావప్రసాద్, కాంగ్రెస్ నేత అంబటి రామకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

Updated Date - 2020-07-06T13:19:39+05:30 IST