Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 12 Oct 2021 13:50:38 IST

Pawan Kalyan కీలక అస్త్రం.. Jagan Reddy సర్కార్‌పై మేధోమధనం.. ఆ వ్యాఖ్యలు చిరంజీవి గురించేనా..!?

twitter-iconwatsapp-iconfb-icon

ఆయన మాటలు వారి మనసుల్లో ఆలోచన కలిగించాయా? దాస్య శృంఖలాల్లో ఉన్నామనే భావనకు వచ్చేశారా? ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ సాధించలేం అనే భావన వారిలో మొదలైందా? చలి చీమలు ఒక్కటై సరిసృపాన్ని చంపినట్లు వేరుపడ్డ అన్నదమ్ములందరూ ఒక్కటయితే కాని లాభం లేదని అనుకుంటున్నారా..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


అస్త్రమేంటి..!?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. ఆంధ్రప్రదేశ్‌ కుల రాజకీయాలపై సంధించిన అస్త్రంపై బాగానే చర్చ నడుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో పవన్‌ ..శ్రమదాన రాజకీయం శ్రమకు తగ్గ ఫలితమే ఇచ్చినట్లు కనబడుతోందనే మాట వినిపిస్తోంది. జగన్‌ రెడ్డి ప్రభుత్వం పవన్‌ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేయడం..పోలీసులు వ్యవహరించిన తీరుపై జనసేన నేతలకు ఆగ్రహానికి కలిగిస్తే ఇతర పార్టీల్లోని కాపు వర్గం నేతలను మేథోమథనం వైపు దృష్టి సారించేలా చేస్తోందట.

Pawan Kalyan కీలక అస్త్రం.. Jagan Reddy సర్కార్‌పై మేధోమధనం.. ఆ వ్యాఖ్యలు చిరంజీవి గురించేనా..!?

కాపు గడపలో కాక రేపిన పవన్..?
కాపు గడప రాజమహేంద్రవరం వేదికగా పవన్‌ కళ్యాణ్‌ 2024 లక్ష్యంగా సాగించిన పర్యటన ఏపీలో కుల రాజకీయాల ప్రాధాన్యతను మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే పవన్ కళ్యాణ్ కులాలను ఆకర్షించే స్థాయిలో వ్యాఖ్యానించటం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అవుతోంది. కులాలకు, మతాలకు అతీతమన్న పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా చేసిన కుల వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరుగుతోంది. కాపు, తెలగ, ఒంటరి, బలిజలు పెద్దన్న పాత్ర పోషిస్తే మార్పు తధ్యమని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు గోదావరి జిల్లాల్లో వేడి పుట్టిస్తున్నాయి. కాపులు ముందుకొస్తే శెట్టి బలిజ, తూర్పు కాపు, కొప్పుల వెలమలు బయటకు వస్తారని దీంతో దళితులకు, మైనార్టీలకు మేలు జరుగుతుందని పవన్ కళ్యాణ్ భావనగా జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు.
Pawan Kalyan కీలక అస్త్రం.. Jagan Reddy సర్కార్‌పై మేధోమధనం.. ఆ వ్యాఖ్యలు చిరంజీవి గురించేనా..!?

రంగా, చిరంజీవి, ముద్రగడల గురించే పవన్‌ వ్యాఖ్యలా..!?
కాపులు ముందుకు రాకపోవటం వల్ల ఇప్పటివరకు కల్గిన నష్టాన్ని చెప్పే ప్రయత్నం చేశారు పవన్‌. 2009 ముందు వచ్చిన నాయకుడు ప్రాణాలు రక్షించుకోలేకపోయామని, 2009లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయిలో ఉండే వ్యక్తిని పలచన చేసేశారని, 2014 తర్వాత జరిగిన బలమైన కాపు ఉద్యమాన్ని నీరు గార్చేశారంటూ పరోక్షంగా వంగవీటి రంగా, చిరంజీవి, ముద్రగడ పద్మనాభాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు పవన్‌. వైసీపీ కమ్మ సామాజిక వర్గాన్ని వర్గ శత్రువుగా ప్రకటించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని, ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న రెడ్లను వైసీపీ నలిపివేస్తుందంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించటం కుల రాజకీయాలను తెరపైకి తెచ్చిందన్న చర్చ జరుగుతోంది.
Pawan Kalyan కీలక అస్త్రం.. Jagan Reddy సర్కార్‌పై మేధోమధనం.. ఆ వ్యాఖ్యలు చిరంజీవి గురించేనా..!?

పవన్‌ వ్యాఖ్యలతో కాపు నేతల్లో అంతర్గత చర్చ.. కాపుల గుర్రు!
ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులను లక్ష్యంగా చేసుకొని పవన్ వ్యాఖ్యానించటంపై వైసీపీలో ఉన్న కాపు నేతలు కూడా అంతర్గంతగా స్వాగతిస్తున్నారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి ఆధిపత్యాన్ని గోదావరి జిల్లాల వైసీపీ కాపు సామాజిక వర్గం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాపులకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరమేనన్న భావన వైసీపీలోని ఆ సామాజిక నేతల్లో వ్యక్తమవుతోంది. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా కొంతమంది కాపు నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారు. కాపులు వైసీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సరైన రాజకీయ నిర్ణయం తీసుకుంటే జనసేనకు అనుకూలంగా మారుతుందన్న భావన జనసేన నేతల్లో వ్యక్తమవుతోంది.
Pawan Kalyan కీలక అస్త్రం.. Jagan Reddy సర్కార్‌పై మేధోమధనం.. ఆ వ్యాఖ్యలు చిరంజీవి గురించేనా..!?

వైసీపీకి చెడ్డపేరు.. జనసేనకు ప్లస్‌ అయ్యిందా..?
పవన్ కళ్యాణ్ పర్యటనపై వైసీపీ ఆత్మనూన్యత భావంతో వ్యవహరించిన తీరు పోలీసు శాఖ ప్రతిష్టతను మరింత దిగజార్చిందనే చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై సామాన్యుల్లో సైతం వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ శ్రమదానం చేసే బాలాజీపేటను పోలీసులు అష్టదిగ్బందం చేసి కర్ఫ్యూ వాతావరణం సృష్టించడం రాజమహేంద్రవాసులకు కోపం తెప్పించింది. ప్రభుత్వ ఒత్తిడితో కఠినంగా వ్యవహరించిన పరిస్థితులపై పోలీస్‌శాఖలోనే కొంతమంది అధికారులు అంతర్మథనం చెందుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజల్లో వైసీపీకి  చెడ్డపేరు వచ్చిందని జనసేనకు కలిసివచ్చిందనే చర్చ జరుగుతోంది.
Pawan Kalyan కీలక అస్త్రం.. Jagan Reddy సర్కార్‌పై మేధోమధనం.. ఆ వ్యాఖ్యలు చిరంజీవి గురించేనా..!?


Pawan Kalyan కీలక అస్త్రం.. Jagan Reddy సర్కార్‌పై మేధోమధనం.. ఆ వ్యాఖ్యలు చిరంజీవి గురించేనా..!?


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.