త్వరలో మూసీ నదిలో బోటు షికారు

ABN , First Publish Date - 2021-11-15T00:06:29+05:30 IST

మూసీ తీరానికి వెళ్లాలంటేనే దుర్వాసన, చెత్తా చెదారంతో అధ్వాన్నంగా ఉండేది. గ్రేటర్‌లో 30 కిలో మీటర్ల మేర ప్రవహించే...

త్వరలో మూసీ నదిలో బోటు షికారు

హైదరాబాద్: మూసీ తీరానికి వెళ్లాలంటేనే దుర్వాసన, చెత్తా చెదారంతో అధ్వాన్నంగా ఉండేది. గ్రేటర్‌లో 30 కిలో మీటర్ల మేర ప్రవహించే మూసీ ఇరువైపులా ఆక్రమణలు ఉండేవి. ఇప్పుడంతా మారిపోతోంది. మూసీ సుందరీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. నాగోల్‌లో 4 కిలో మీటర్ల దూరం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. త్వరలో మూసీ నదిలో బోటు షికారు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూసీ నది పరివాహక ప్రాంతాలు ఎలా ఉన్నాయి.. మూసీ నది ప్రక్షాళన ఎంతవరకు వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు ఎంత వరకు అమలయ్యాయి. గ్రేటర్‌లో మూసీ సుందరీకరణపై గ్రౌండ్ రిపోర్ట్. 




Updated Date - 2021-11-15T00:06:29+05:30 IST