Abn logo
Nov 23 2021 @ 09:15AM

HYD : ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్‌తో కదలిక.. పోలీసుల ‘మసాజ్‌’ షురూ..

  • ‘ఆపరేషన్‌ మసాజ్‌’ కథనంతో కదలిక 
  • ఆ మసాజ్‌ సెంటర్లపై దాడులు
  • నిర్వాహకులు, యువతులు, కస్టమర్లు అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ : స్పా, మసాజ్‌ సెంటర్ల ముసుగులో సాగుతున్న హైటెక్‌ వ్యభిచార దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ వెలికితీసిన కథనం (ఆపరేషన్‌ మసాజ్‌) పై స్పందించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న మసాజ్‌, స్పా సెంటర్లపై నగరవ్యాప్తంగా దాడులు చేసి పదుల సంఖ్యలో నిందితులను అరెస్ట్‌ చేశారు. నార్త్‌జోన్‌ పరిధిలోని మహంకాళి, కార్ఖానా, మారేడ్‌పల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మూడు మసాజ్‌ సెంటర్లపై దాడులు చేసిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది నలుగురు నిర్వాహకులతో పాటు 12 మంది యువతులు, ఐదుగురు కస్టమర్లను అరెస్ట్‌ చేశారు.


పంజాగుట్ట, బంజారాహిల్స్‌లో..

పంజాగుట్ట, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో అథర్వ హమామ్‌ స్పా, ఎలిగెంట్‌ బ్యూటీ సెలూన్‌తో పాటు మరో స్పాపై వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి ముగ్గురు కస్టమర్లతోపాటు తొమ్మిది మంది యువతులను అరెస్ట్‌ చేశారు.

సెంట్రల్‌ జోన్‌ పరిధిలో..

సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది రాంగోపాల్‌ పేట్‌, నారాయణగూడ పోలీస్టేషన్ల పరిధిలో స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న మూడు సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఇద్దరు మేనేజర్లను, ఒక రిసెప్షనిస్టును, ఐదుగురు మహిళలను, ముగ్గురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. రాంగోపాల్‌ పేట పోలీస్టేషన్‌ పరిధి పీజీ రోడ్‌లోని బ్లాక్‌ హెయిర్‌ బ్యూటీ సెలూన్‌, సింధీకాలనీలో అవంత్‌ హెయిర్‌ బ్యూటీ సెలూన్‌, నారాయణగూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ఇందర్‌ కాంప్లెక్స్‌లో ఫ్యామిలీ థాయ్‌ స్పాపై దాడులు నిర్వహించారు. నిర్వాహకులతో పాటు యువతులు, కస్టమర్లను అరెస్ట్‌ చేశారు. తదుపరి విచారణ కోసం నిందితులను ఆయా పోలీస్టేషన్లలో అప్పగించారు.

హైదరాబాద్మరిన్ని...