ABN ఎఫెక్ట్.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు

ABN , First Publish Date - 2021-12-29T23:07:09+05:30 IST

న్యూ ఇయర్ వేడుకలపై ABN కథనాలకు తెలంగాణ పోలీసులు స్పందించారు. న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు..

ABN ఎఫెక్ట్.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు

హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలపై ABN కథనాలకు తెలంగాణ పోలీసులు స్పందించారు. న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. పబ్స్, హోటళ్లు, క్లబ్‌లకు కొత్త కమిషనర్ ఆనంద్ మార్గదర్శకాలు విడుదల చేశారు. న్యూ ఇయర్ పార్టీల్లో డీజేలకు అనుమతి లేదని కమిషనర్ స్పష్టం చేశారు. పబ్‌లు, రెస్టారెంట్లకు పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


‘‘కొవిడ్ రూల్స్‌ను అతిక్రమిస్తే చర్యలు తప్పవు. రెండు డోసులు తీసుకున్నవారికే వేడుకలకు అనుమతి. ఈవెంట్లకు పరిమితి మించి పాసులను అమ్మొద్దు. పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు. రాత్రి 11 గంటల నుంచి ఉ.5 గంటల వరకు ఫ్లైఓవర్లు మూసివేత. తాగి రోడ్లపై హంగామ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే తీవ్ర చర్యలు తప్పవు. 31న రాత్రి ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తాం. మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తాం.’’ అని కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. 



Updated Date - 2021-12-29T23:07:09+05:30 IST