తిరుమల: కోవిడ్ నిబంధనలు అమలులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలసత్వం వహిస్తోందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై టీటీడీ స్పందించింది. కోవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తూ రెండు డోసుల వాక్సిన్ లేదా 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్ ఉంటేనే భక్తులను తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్దే భక్తులు రెండిట్లో ఏదో ఒక్కటి చూపించాలని, వ్యాక్సిన్ కానీ నెగటివ్ సర్టిఫికెట్ లేని భక్తులను తిరుమలకు అనుమతించమని టీటీడీ ప్రకటించింది.