ఏబీఎన్ ఎఫెక్ట్...ప్లాస్టిక్ కోడిగుడ్లపై స్పందించిన అధికారులు

ABN , First Publish Date - 2021-07-20T18:12:03+05:30 IST

నెల్లూరు జిల్లాలోని ప్లాస్టిక్ కోడిగుడ్ల వ్యవహారాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది.

ఏబీఎన్ ఎఫెక్ట్...ప్లాస్టిక్ కోడిగుడ్లపై స్పందించిన అధికారులు

నెల్లూరు: జిల్లాలోని వరికుంటపాడు మండలం, ఆండ్రావారిపల్లెలో ప్లాస్టిక్ కోడిగుడ్ల వ్యవహారాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. ఏబీఎన్ కథనాలకి అధికారులు స్పందించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నర్మద కోడిగుడ్లను పరిశీలించారు. కాలం చెల్లిన కోడిగుడ్లుగా గుర్తించి వాటిని వాడొద్దని గ్రామస్తులకు చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు వస్తే 9398211403కి ఫోన్ చెయ్యాలని నర్మద సూచించారు.


నెల్లూరు జిల్లాలో ప్లాస్టిక్ కోడి గుడ్లు కలకలం రేపుతున్నాయి. వరికుంటపాడు మండలం, అండ్రావారిపల్లెలో మార్కెట్ ధరకంటే తక్కువ ధరకు గుడ్లు అమ్మడంతో గ్రామస్తులందరూ కొనుగోలు చేశారు. గుడ్లు ఉడకపెడుతుండగా గుడ్లు కదులుతున్నా ఉడకడంలేదు. అనుమానం వచ్చిన కొందరు గుడ్డును నేలకేసి కొట్టి చూస్తే అది పగలకుండా రబ్బరు బంతిలా ఎగరడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కొనుగోలు చేసిన కోడిగుడ్లు తెలుపు రంగుకు బదులు లేత ఎరుపు రంగులో ఉండడం, గుడ్డు లోపల పదార్థం పసుపు రంగులో కాకుండా ఆరంజ్ రంగులో ఉండడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు.

Updated Date - 2021-07-20T18:12:03+05:30 IST