టిక్ టాక్ క్రిమినల్స్‌పై ఏబీఎన్ స్పెషల్ ఫోకస్

ABN , First Publish Date - 2022-01-10T04:15:42+05:30 IST

ఒక వెలుగు వెలిగి షార్ట్ వీడియోలతో ఎందరో హిడెన్ టాలెంట్‌ను వెలుగులోకి తీసుకొని వచ్చిన మొట్టమొదటి యాప్ టిక్ టాక్ .. మిలియన్ల కొద్దీ...

టిక్ టాక్ క్రిమినల్స్‌పై ఏబీఎన్ స్పెషల్ ఫోకస్

ఒక వెలుగు వెలిగి షార్ట్  వీడియోలతో ఎందరో  హిడెన్ టాలెంట్‌ను వెలుగులోకి  తీసుకొని వచ్చిన మొట్టమొదటి యాప్ టిక్ టాక్ .. మిలియన్ల కొద్దీ  డౌన్లోడ్‌లతో ఒక వెలుగు వెలిగింది. ఈ యాప్ యువతనే కాదు అన్ని వయసుల వారిని ఓ  ఊపు ఊపింది....  తమకున్న ఖాళీ సమయాల్లో తమలోని టాలెంట్‌ను బయట పెట్టడానికి ఈ యాప్ వారధిగా పని చేసింది ... అలాంటి టిక్ టాక్ బ్యాన్ కావడంతో .అప్పటి పరిచయాలను అడ్డం పెట్టుకొని కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. అప్పట్లో తమతో సన్నిహితంగా ఉన్న అమ్మాయిల ఫొటోలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్‌కు దిగుతున్నారు. టిక్ టాక్ క్రిమినల్స్‌పై ఏబీఎన్ క్రైమ్ బ్యూరో స్పెషల్ ఫోకస్. 


టిక్ టాక్ ఈ యాప్ వాడని, యాప్ గురించి వినని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. ఈ యాప్ ఎందరికో సెలబ్రెటీ హోదాను తెచ్చిపెట్టుంది. మరొకొందరికి ఉపాదినిచ్చింది.. ఇంకొందరి టాలెంట్ ను విశ్వవ్యాప్తం చేసింది. యాప్ తెరమీదకు వచ్చిన కొద్ది రోజులకే యమా పేమస్ అయిపొయింది. లక్షల కొద్దీ డౌన్ లోడ్లు జరిగాయి. నిత్యం లక్షల కొద్దీ వీడియోలు ఈ యాప్‌లో అప్ లోడ్ అయ్యాయి. తమకున్న అభిరుచుల బట్టి తమకు ఏ అంశంలో ఆసక్తి ఉందో అలాంటి వీడియోలను అపోల్డ్ చేయడం ద్వారా లక్షలాది లైకులు సంపాదించుకున్నారు. అంతకుమించి  ఫాలోయర్స్‌ను సంపాదించుకున్నారు. ఆలా అట్టి స్వల్పకాలంలో చాలామంది టిక్ ట్యాకర్స్ పబ్లిక్ ఫిగర్స్‌గా మారిపోయారు.


టిక్ టాక్ యాప్‌‌లో 15 సెకన్ల నిడివి వీడియోను అప్లోడ్ చేసే వెసులుబాటుకి  ఉండేది. ఈ యాప్‌ ద్వారా జోక్స్‌ క్లిప్స్‌, వీడియో సాంగ్స్‌, సినిమా డైలాగ్స్‌కు తగ్గట్లుగా లిప్‌ మూమెంట్‌, బాడీ మూమెంట్స్‌ ఇవ్వడం, డ్యాన్స్‌ వంటివి ఇందులో ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. చైనీస్‌ ఇంటర్నెట్‌ టెక్నాలజీ కంపెనీ 'బైటీ డ్యాన్స్‌' టిక్‌టాక్‌ను రూపొందించింది. 2016‌లో డౌయిన్‌ పేరుతో ఇది చైనాలో విడుదలైంది. ఆ తర్వాత ఏడాదికి 'టిక్‌టాక్‌' పేరుతో అంతర్జాతీయ మార్కెట్లలోకి ఈ యాప్‌ విడుదలచేశారు. కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా వినియోగదారులను సొంతం చేసుకుంది అంటే ఈ యాప్ క్రేజ్ యెలాంటోడో యిట్టె చెప్పేయొచ్చు.


వ్యక్తుల సృజనాత్మకతను ప్రోత్సహించడం...  ఎంటర్టైన్మెంట్ అందించడం అనే కాన్సెప్ట్‌తో మొదలైన టిక్‌టాక్ యాప్ భారత్‌ను ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా 14 స్థానిక భాషలతో అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్‌మెంట్ అందించి లోకల్‌గా ఎంతోమందికి సెలబ్రిటీ స్టేటస్ తీసుకొచ్చింది. అలాంటి యాప్ ప్రస్థానానికి భారత్‌లో తెరపడింది. సైబర్ సెక్యూరిటీ రీత్యా కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్‌ సహా 59 చైనా యాప్స్‌పై నిషేధం విధించింది..  భారత్‌లో టిక్ టాక్‌కు తెర పడటానికి ముందే సుమారుగా ముప్పై కోట్ల యాప్ వినియోగదారులు ఉన్నట్టు అంచనా. 


టిక్ టాక్ బ్యాన్ అయ్యాక అసలు కష్టాలు మొదలయ్యాయి. టిక్ టాక్‌లో షార్ట్ వీడియోస్ అప్ లోడ్ చేసి విపరీతమైన క్రేజ్ సంపాదించినా వారు,  ఓవర్ నైట్ సెలెబ్రటీలుగా మారిన వారు బ్యాన్ అనంతరం ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. గతంలో  జరిగినవి టిక్ టాక్‌లో కాస్త ఫెమ్ అవ్వగానే  టాలెంటును అభినందనాలు వెల్లువెత్తిన సమయంలో  పరిచయాలు పెరగడం, అనంతరం ఒకరి నెంబర్లు ఒకరు మార్చుకునే దాకా ఆ  పరిచయాలు వెళ్లాయి. ఇపుడు ఆ పరిచయాలే టిక్ ట్యాకర్స్ పాలిట శాపంగా మారాయి. మెడకు ఉచ్చు బిగిస్తున్నాయి.


టిక్ టాక్ బ్యాన్ కాగానే అప్పటిదాకా  యాప్‌లో యాక్టీవ్ ఉండే వారు టిక్ టాక్ దూరం అయ్యారు. యాప్ ఉన్నత వరకు లైకులు , కామెంట్లతో అమ్మాయిలకు దగ్గరగా ఉన్న అబ్బాయిలు కొందరు బ్లాక్ మెయిల్స్‌కు దిగుతున్నారు. అప్పటికే కాంట్రాక్టులు ఇచ్చి పుచ్చుకుని ఉంటారు కాబట్టి తమతో చాట్ చేయాలనీ, మాట్లాడాలని ప్రెజర్ చేస్తున్నారు.  తీరా సరే అనుకుని అమ్మాయిలు చాట్ చేస్తే అసభ్యకర మెసేజ్‌లతో వేధిస్తున్నారని అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాదని చాట్ చేయడాం మానేస్తే అప్పటి టిక్ టాక్ వీడియోలను మార్ఫ్ చేసి ఫోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తోంది..


ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు టిక్ టాక్ క్రిమినల్స్‌గా వికృత రూపానికి అద్దం పడుతున్నాయి. నంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి చెందిన పాలకూరు నవీన్ లా రెండవ సంవత్సరం చదువుతున్నాడు. టిక్ టాక్ ఉన్న సమయంలో అందులో వీడియోలు చేసేవాడు. టిక్‌టాక్‌ ద్వారా చాలా మందికి ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపించి.. అందులో యువతులు, మహిళలతో స్నేహం చేసేవాడు.. వారిని వేధింపులకు గురిచేసేవాడు. కానీ ఎవరు నవీన్‌పై ఫిర్యాదు చేసే దైర్యం చెయ్యలేదు. తాజాగా ఓ యువతిని ఆన్‌లైన్‌ వీడియో బ్లాగింగ్‌ యాప్‌ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేయడంతో పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నవీన్‌ను కటకటాలకు నెట్టారు..


హైదరాబాద్‌లోని  ఓ యువకుడు టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు.. టిక్ టాక్ బ్యాన్ అయ్యాక అప్పటికే తన ఫాలోయింగ్ లిస్ట్‌లో ఉన్న అమ్మాయిలు  నెంబర్లను సేకరించి అస్లీల వీడియోలను ఓ యువతికి పంపేవాడు. రాను రాను వేధింపులు ఎక్కువ కావడంతో విసిగిపోయిన యువతి మేనత్తకు తెలిపింది. దీంతో ఆమె సదరు యువకుడిని మందలించడంతో మరింత రగిలిపోయిన ఆ యువకుడు డేటింగ్ యాప్స్‌లో ఆమె ఫొటో పెట్టి ఫోన్ నంబర్ ఇచ్చాడు. దీంతో సదరు మహిళకు రోజు కాల్స్ వస్తుండటంతో ఆమె సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.


తాజాగా హైదరాబాద్‌కు చెందినా ఓ యువతి వీడియోలను మార్ఫింగ్ చేసి యూట్యూబ్‌లో అపోల్డ్ చేసాడో ఓ ఘనుడు. టిక్ టాక్ ద్వారా పేమస్ అయినా సదరు యువతిని ఫాలో అవుతున్న యువకుడు యాప్ బ్యాన్ కాగానే తనతో చాట్ చేయాలంటూ వెంటబడ్డాడు. ప్రేమ పేరుతొ వేధింపులకు గురి చేశాసాడు. సదరు యువతి  ప్రతిఘటించేంచడంతో మరింత రెచ్చిపోయిన ఆ యువకుడు ఆ యువతి వీడియోలను సేకరించి న్యూడ్‌గా ఉన్నట్టు మార్ఫ్ చేసి ఆమె వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం కలకలం రేపింది.  


టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన వాళ్లలో ఫన్ బకెట్ భార్గవ్ కూడా ఒకడు. అంతకు ముందు యుట్యూబ్‌లో ఫన్ బకెట్ వీడియోలు చేసే వాడు. ఆ తర్వాత కాస్త పాపులారిటీని సంపాదించుకుని కొన్ని టీవీ షోలలో కూడా కనిపించాడు. టిక్‌టాక్‌ నిషేధానికి గురికావడంతో మోజో, రెపోసో వంటి యాప్‌లలో ప్రస్తుతం వీడియోలు చేస్తున్న క్రమంలోనే  ఇంటర్ మీడియట్  విద్యార్థిని పరిచయమైంది. తనను కూడా టిక్ టాక్ స్టార్‌ను చేస్తానని చెప్పాడు. ఆమెకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గర్భవతి కావడంతో దూరంపెట్టాడు. ఆమె నగరంలోని దిశ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భార్గవ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..


గత సంవత్సరం సంచలనమ్ సృష్టించిన సీరియల్ నటి శ్రావణి కేసులకో దేవరాజ్ అదేరకంగా బెదిరించినట్టు పోలీసుల విచారణలో తేలింది. రవి తేజ, పవన్ కళ్యాణ్‌,  చిరంజీవి ఇలా సినిమా హీరోల డూపుల్లా ఉన్నవారు అమ్మాయిలకు తమకున్న క్రేజ్‌ను ఉపయోగించుకొని మానసిక వేదనకు గురి చెయ్యడమే కాకా ..తమతో వీడియోలు చెయ్యాలి అని కుదరదు అంటే మీ వీడియోలు ఉన్నాయి. వాయిస్ రికార్డ్‌లు ఉన్నాయి అని బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారు అని సమాచారం.. ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్న వారినుండి ఎలా తప్పించుకోవాలో తెలియుగాక మానసిక వేదన పడుతున్న వారు  ఎలా వీరినుండి రక్షణ పొందాలో తెలియక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..


ఇదంతా ఒక ఎత్తు అయితే  మరికొంత మంది సోషల్ మీడియాలో పరిచయమైనా వారి కోసం కన్నా పేగులను సైతం కాదనుకుని వెళ్లిపోతున్నారు. టిక్ టాక్ ద్వారా  చిగురించిన స్నేహం కాస్త ప్రేమ, వివాహేతర సంబంధాలకు దారి తీస్తోంది. చివరకు కొందరు ఆ ప్రేమను నిజమని నమ్మి. తల్లిదండ్రులని కాదనుకుని ఇలా సోషల్ మీడియా, టిక్ టాక్ లాంటి యాప్‌ల ద్వారా పరిచయం అయిన వారికోసం అందరిని కాదనుకుని వెళ్లిపోతున్నారు.  తీరా ఇంటి నుంచి కాలు బయట పెట్టాక మోసపోయామని తెలుసుకుని లబోదిబో మంటున్నారు..    


ఇటీవల కాలంలో తెలంగాణ‌లోని సిద్దిపేట జిల్లాలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. సిద్దిపేట జిల్లాకు చెందిన అమ్మాయికి అనంతపురం జిల్లా దర్గా వన్నూరు‌కు చెందిన అబ్బాయితో టిక్ టాక్‌లో పరిచయం పెరిగింది. కొన్నాళ్ల  తార్వాత ఆ పరిచయం ప్రేమగా మారడంతో  పెళ్ళి చేసుకుంటాడని భావించిన ఆ అమ్మాయి ఇల్లు వదిలి వచ్చేసింది. తోడుగా మరో అమ్మాయిని వెంట తెచ్చుకుంది. అబ్బాయి ఇంటికి వెళ్తే నీవెవరో తెలియదు అనడంతో షాక్‌కు గురైంది.. మరికొన్ని సంఘటనల్లో  టిక్ టాక్ వంటి యాప్ల ద్వారా తలెత్తిన వివాదాలు మధ్య  భార్యాభార్తలు విడాకులు తీసిన ఉదంతాలు ఉన్నాయి.


టిక్ టాక్ ద్వారా పరిచయం అయినా  సమయంలో చనువు పెరిగాక ఒకరి ఒకరు  ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకోవడంతోనే అసలు చిక్కులు మొదలయ్యాయి. అలా సేకరించిన నెంబర్లను కొందరు యువకులు వాట్సాప్ గ్రూప్‌లలో ఫార్వార్డ్ చేస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి కాల్ గర్ల్ వెబ్ సైట్లలో ఆ నెంబర్లను ఉంచుతున్నారు. అసభ్యకర మెసేజెస్‌లతో హింసిస్తున్నారు. తమ మాట వినకపోతే పరిణామాలు తీవ్రనగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. తాము చెప్పిన ప్లేస్‌కు రావాలని వీడియోలను ఫోర్న్ సైట్లలో అప్లోడ్ చేస్తామని బేదిరిస్తూ శారీరకంగా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టిక్ టాక్‌లో వీడియోలు అప్లోడ్ చేసిన పాపానికి చాలామంది గత టిక్ ట్యాకర్స్ ఇలాంటి బ్లాక్ మెయిలింగ్స్‌ను ఎదుర్కుంటున్నారు.


ఇలాంటి నికృష్టుల ఆగడాలకు తలొగ్గని కొంతమంది యువతులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మరికొందరు మాత్రం  ఎవరికి చెప్పుకోలేని మానసిక క్షోభను అనుభవిస్తూ తనువూ చాలిస్తున్నారు. ఇకనైనా ఇలాంటి టిక్ ‌టాక్ క్రిమినల్స్‌పై పోలీసులు ద్రుష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటే ఇలాంటి ఆగడాలు తగ్గే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరోవైపు వేధింపులు ఎదుర్కుంటున్న  యువతులు సైతం ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఇంకొంతమంది యువతులకు మనోధైర్యాన్ని కలిపించిన వారు అవుతారనే అభిప్రాయం సైతం వ్యక్తం అవుతోంది..



Updated Date - 2022-01-10T04:15:42+05:30 IST