ఎవరికి ఆపద వచ్చినా.. గుర్తుకొచ్చే దమ్మున్న ABN.. ప్రజలే సర్వదా అండ.

ABN , First Publish Date - 2021-10-15T19:02:05+05:30 IST

ఆపద వస్తే.. ఏబీఎన్‌ అండగా ఉంటుందన్న అభిప్రాయం తెలుగు,....

ఎవరికి ఆపద వచ్చినా.. గుర్తుకొచ్చే దమ్మున్న ABN.. ప్రజలే సర్వదా అండ.

ఒకటా, రెండా.. ఏబీఎన్‌ సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న ప్రజా పాత్రికేయం సత్ఫలితాలిస్తోంది. అవసరార్థులకు అండగా నిలబడుతోంది. సమస్యలు ఉన్నచోట పరిష్కార మార్గమై నిలుస్తోంది. బాధితులైన వారికి న్యాయం కోసం పోరాడుతోంది. 


ఆపద వస్తే.. ఏబీఎన్‌ అండగా ఉంటుందన్న అభిప్రాయం తెలుగు రాష్ట్రాల ప్రజల మదిలో మెదులుతుందన్నది అక్షర సత్యం. అలా.. ఎన్నో, ఎన్నెన్నో కష్టాలను కడతేర్చేలా బాధితులకు తోడ్పాటునిచ్చింది ఏబీఎన్‌. గుట్టుగా సాగించే అరాచక పర్వాలను తెరపై చూపించింది. ప్రజలముందుకు నివేదికను తెచ్చి.. నిర్ణయాధికారం ప్రజలకే అప్పగించింది.


ఎన్నో, ఎన్నెన్నో అక్రమాలను, మరెన్నో ప్రత్యేక కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూనే ఉంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. ఎన్ని సునామీలు ఎదురవుతున్నా రొమ్ము విరుచుకొని ధైర్యంగా నిలబడుతున్నది దమ్మున్న ఛానెల్‌. ఆ సాహసమే ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిని నడిపిస్తోంది. ఫలితంగా మనసున్న చానెల్‌గా బాధితుల పక్షాన నిలుస్తోంది. ఉరిమే ఉత్సాహాలకు, వెల్లివిరిసే సంతోషాలకు వేదికగా ఉంటోంది. వియ్‌ రిపోర్ట్‌.. యూ డిసైడ్‌ అంటూ ప్రేక్షకులే స్వచ్ఛందంగా తమ ఛాయిస్‌ ఏంటో నిర్ణయించుకునే అవకాశం కల్పించింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి.


ఈ పన్నెండేళ్ల పయనంలో వందలకొద్దీ మైలురాళ్లను అధిగమించింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. ప్రజలకు అండగా, ప్రజల వైపున నిలబడి, ప్రజల గొంతుక అవుతోంది. 'తెలుగు వాళ్లకు రెండు రాష్ట్రాలు.. ఒకే ఒక్క విశ్వసనీయ మాధ్యమం ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి' అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. జనం గుండె గొంతుకగా నిలుస్తోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. తొలినుంచీ జనాభిప్రాయానికి మారుపేరుగా కొనసాగుతూ ఉంది. ఇకపై కూడా అలాగే ఉంటుందని హామీ ఇస్తోంది. ఎప్పటికీ జనం మనోగతాన్ని ఆవిష్కరిస్తూనే ఉంటుందని భరోసా ఇస్తోంది. ఏ జెండాతో ఏబీఎన్‌కు పనిలేదు. ఎందుకంటే ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిది ప్రజల ఎజెండా. అందుకే ప్రజలే ఏబీఎన్‌కు సర్వదా అండ. ప్రజలకు ఏబీఎన్‌ అండ దండ. 


- సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి


Updated Date - 2021-10-15T19:02:05+05:30 IST