Abn Andhrajyothy: టీడీపీ నుంచి వెళ్లిపోవాలని నాని డిసైడయ్యారా?

ABN , First Publish Date - 2022-07-22T01:49:15+05:30 IST

ఏపీ (AP)లో టీడీపీ ఎంపీ కేశినేని నాని (Tdp Mp Kesineni Nani) అంశం చర్చనీయాంశంగా మారింది. తన తమ్ముడు కేశినేని చిన్ని...

Abn Andhrajyothy: టీడీపీ నుంచి వెళ్లిపోవాలని నాని డిసైడయ్యారా?

అమరావతి (Amaravathi): ఏపీ (AP)లో టీడీపీ ఎంపీ కేశినేని నాని (Tdp Mp Kesineni Nani) అంశం చర్చనీయాంశంగా మారింది. తన తమ్ముడు కేశినేని చిన్ని (Kesineni Chinni) కారు ఎంపీ స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నారని కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కుటుంబ వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకుంటుంది. గత ఎన్నికల్లో విజయవాడ (Vijayawada) నుంచి టీడీపీ ఎంపీగా కేశినేని గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో యాక్టివ్‌గానే ఉన్నారు. కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్ని కూడా టీడీపీలో ఉన్నారు. సడెన్‌గా కుటుంబ విభేదాలు బయటపడటం.. అదీ సొంత తమ్ముడిపై కేశినేని కేసు పెట్టడం వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి... టీడీపీ ఎంపీ కేశినేని తిరుగుబాటు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవదని.. 60 సీట్లు మాత్రమే గెలుస్తుందని.. అందుకే ఇప్పటి నుంచే టీడీపీ ఎంపీ కేశినేని నాని .. ఆ పార్టీ నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 60 సీట్లలో గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీని వీడి ఎంపీ సీఎం రమేశ్ ద్వారా బీజేపీ చేరతారని కూడా ప్రచారం జరుగుతోంది.


ఈ నేపథ్యంలో ‘‘టీడీపీ నుంచి వెళ్లిపోవాలని కేశినేని నాని డిసైడయ్యారా?. నానిని వదిలించుకోవడానికి టీడీపీయే రెడీ అయిందా?. వైసీపీ వ్యూహంలో భాగంగానే నాని ఆ వ్యాఖ్యలు చేశారా?. ఏపీలో ఏక్ నాథ్ షిండే ప్రస్తావన ఎందుకొస్తోంది?. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎందుకు ఆ కామెంట్స్ చేశారు. టీడీపీతో సంబంధమే లేని సీఎం రమేశ్‌ను నాని ఎందుకు కెలికారు?.’’ అనే అంశాలపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తో  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి  ఇంటర్యూ నిర్వహించింది. ఈ వీడియోను చూడగలరు..



Updated Date - 2022-07-22T01:49:15+05:30 IST