"విశాఖ సింహాచలం భూముల్లో అక్రమాలు జరిగాయి... అన్నింటిని బయటకు తీస్తాం... కచ్చితంగా త్వరలోనే అన్ని బయటకు వస్తాయి..." ఇవి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తరుచూ చేస్తున్న వ్యాఖ్యలు. ఈ క్రమంలోనే వరుస విచారణలు మొదలయ్యాయి. మరి ఇప్పటికే దేవాదాయ శాఖ వేసిన కమిటీ ఏం తేల్చింది..? మళ్లీ విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు..? అసలా విచారణ వెనుక అంతర్యం ఏమిటి..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ఇన్‌సైడ్‌లో చూద్దాం..
ఆమె తొలగింపును తట్టుకోలేక..!
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు టార్గెట్‌గా కొంతకాలంగా అధికార వైసీపీ పావులు కదుపుతూనే ఉంది. అందుకే మాన్సాస్, సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా ఆయన్ను తొలగించి.. సంచయిత గజపతిని నియమించింది. అయితే కోర్టు ఆదేశాలతో ఏడాది గడిచిన తర్వాత ఆమెను తొలగించారు. దీంతో ఇది తట్టుకోలేని వైసీపీ నేత విజయసాయిరెడ్డి... అశోక్ గజపతిరాజుపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పాటు న్యాయ పోరాటం చేస్తామని, ఆ స్థానం నుండి ఆయన్ను దించేస్తామని ప్రకటనలు చేశారు.
వ్యూహ రచన..!
అన్నదే తడువుగా అందుకు పక్కా స్కెచ్ గీశారట. మాన్సాస్, సింహాచలం భూముల్లో అక్రమాలు జరిగాయని, 840 ఎకరాల భూములను రికార్డుల నుండి తొలగించారని, ఇవన్నీ అశోక్ గజపతే చేశారని, లేదా చేయించారనే నిందలు ఆయనపై మోపేందుకు వ్యూహరచన చేశారట. వీటిపై జిల్లా పరిషత్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు దిశానిర్దేశం కూడా చేశారని సమాచారం.
నివేదిక రెడీ!
అయితే.. మాన్సాస్‌పై ప్రస్తుతం ఇంతవరకు పూర్తిస్థాయి ఆడిటింగ్ జరగకపోయినా... దేవస్థానం విషయంలో స్పీడ్‌గా కదిలారు. రికార్డుల నుండి ఈ భూములు తొలగింపునకు బాధ్యుడ్ని చేస్తూ గతంలో ఈవోగా పనిచేసి, ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న రామచంద్రమోహన్ అడ్డం పడతారని, ప్రభుత్వానికి సరెండర్ చేసి, దీనిపైన ప్రత్యేకంగా టీమ్‌లు ఏర్పాటు చేసి రికార్డులను పరిశీలించారు. అయితే ఇప్పుడు నివేదిక సిద్ధమైంది. ఈ నివేదికను జూలై 16వ తేదీన ప్రభుత్వానికి ఇచ్చారు.
మళ్లీ విజిలెన్స్ వేశారా..!?
2010 సంవత్సరంలో రూపొందించిన రికార్డు ప్రకారం సింహాచలం దేవస్థానానికి 11,118 ఎకరాల భూమి ఉంది. అయితే 2016లో ప్రభుత్వ రికార్డులకు ఎక్కించినప్పుడు వాటి విస్తీర్ణం 10,278 ఎకరాలుగా పేర్కొన్నారు. ఈ వ్యత్యాసం 840 ఎకరాలు. అయితే ఈ భూములను రికార్డు నుండి తొలగించారు. వీటిని ఎలాంటి నిషేధిత జాబితాలో పెట్టకుండా ఎందుకు తొలగించారో ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు. అయితే దీన్ని బూచిగా చూపించి అక్రమాలు చేశారంటూ ఆరోపణలు మొదలు పెట్టారు. 74 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని, ఇందులో నిజానిజాలను తేల్చాలని విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. విజిలెన్స్ కూడా విచారణ మొదలుపెట్టింది. అందులో ఏం చేస్తున్నారో ఇప్పటికి బయటకు రాలేదు. నిజంగా అక్రమాలు జరిగివుంటే దేవాదాయ కమిటీ నివేదికతోనే యాక్షన్ తీసుకునే ఉండేవారని.. అలాంటిదేమి లేదు కాబట్టే మళ్లీ విజిలెన్స్ వేశారని తెలుస్తోంది.
మళ్లీ కొత్త ప్లాన్ ఇదీ..!
ఇదిలావుంటే.. అశోక్ గజపతిరాజుని టార్గెట్ చేయడానికి అసలు కారణం వేరే ఉందట. అదేమిటంటే- గతంలో వైఎస్ జగన్మోహారెడ్డి జైలుకు వెళ్లడానికి, ఈ కేసులు రావడానికి ముగ్గురు కారణమట. అందులో ఒకరు ఎర్రంనాయుడు, మరొకరు దాడి వీరభద్రరావు. ఒకరు లేరు. మరొకరు వారి పార్టీలోనే ఉన్నారు. ఇక మిగిలింది అశోక్ గజపతిరాజు. అందుకే ఆయన్ను టార్గెట్ చేస్తూ మాన్సాస్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించారు. అయితే అశోక్ గజపతిరాజు కోర్టు ద్వారా మళ్లీ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఇది తట్టుకోలేని ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ కొత్త ప్లాన్ వేసి మాన్సాస్, సింహాచలం భూములు అక్రమాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని టాక్.
ఎంత వెతికినా దొరకలేదా..!?
మరోవైపు.. వైసీపీ నేతలను చూసి ఉత్తరాంధ్ర వాసులు నవ్వుకుంటున్నారు. వారి దగ్గర ఉన్న భూములనే వారు దానాలు చేస్తే.. మళ్లీ అవే భూములను వారే కాజేశారని అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా అవేవి పట్టించుకోని విజయసాయిరెడ్డి.. అశోక్ గజపతి రాజు టార్గెట్‌గా పావులు కదుపుతున్నారట. జిల్లా పరిషత్ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు, దేవాదాయశాఖ అధికారులకు "తప్పులు వెతకండి" అని స్వయంగా చెప్పారట. వారు ఎంత వెతికినా దొరక్కపోవడం, అలాగే దేవాదాయశాఖ వేసిన కమిటీ విచారణలో ఏమీ తేలకపోవడంతో.. విజిలెన్స్ ఎంక్వైరీ వేశారట. మరి విజిలెన్స్ విచారణలో ఏం వెల్లడవుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
YS Jagan Cabinet : ఆ ఇద్దరిలో ఒకరికి Minister పదవీ గండం.. Tammineni కి చిగురిస్తున్న ఆశలు.. ఎవరికీ అర్థం కాని పరిస్థితి.. ఏం జరుగుతుందో..!?Dharmana Prasad : పెద్దాయన రిటైర్మెంట్ పక్కానా.. ఆయన టార్గెట్ ఏంటి.. యువనేతకు ఛాన్స్ వస్తుందా..!?Grama, Ward Sachivalayam ఉద్యోగుల కుటుంబాలకు Jagan Govt షాక్..ABN Inside : అజ్ఞాతం వీడనున్న కీలక నేత.. TDP నుంచి ఆహ్వానం అందిందా.. అదే జరిగితే AP రాజకీయాల్లో భారీ మార్పులు!సెప్టెంబర్‌లో Nara Lokesh అరెస్ట్.. Chandrababu తో రెండు సార్లు చెప్పిన మాజీ మంత్రి.. TDP లో హాట్ డిస్కషన్.. ఏం జరగబోతోంది..!?Jagan కు షర్మిల ఎందుకు రాఖీ కట్టలేదు?.. ఇడుపులపాయలో అసలేం జరిగింది!?TDP లో ఉన్నప్పుడు కొనసాగిన హవా.. ఇప్పుడు YSRCP MP గా ఉన్నా పప్పులుడకట్లేదేం.. రాత్రికి రాత్రే ఎందుకిలా.. పొమ్మన లేక పొగ పెడుతున్నారా..!?Gorantla అసంతృప్తికి ఆ లేడీ ఎమ్మెల్యే కారణమా.. అసలేం జరిగింది.. అలక పోయినట్లేనా.. Butchaiah మనసులో ఏముంది.. TDP ఏమనుకుంటోంది..!?షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్‌కిషోర్.. సెప్టెంబర్ నుంచి రంగంలోకి..!