ఏ మాత్రం సిద్ధంగా లేము.. ఏబీఎన్ పోల్‌కు అనూహ్య స్పందన

ABN , First Publish Date - 2021-02-26T00:59:32+05:30 IST

ఏ మాత్రం సిద్ధంగా లేము.. ఏబీఎన్ పోల్‌కు అనూహ్య స్పందన

ఏ మాత్రం సిద్ధంగా లేము.. ఏబీఎన్ పోల్‌కు అనూహ్య స్పందన

విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చేయాలన్న బీజేపీ ఆలోచన వెనుక వైసీపీ ప్రమేయం ఉందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. వైసీపీ జోక్యం లేకుండా వ్యవహారం ఇంతవరకు రాలేదని ఏబీఎన్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో 81 శాతం మంది ప్రజలు తేల్చిచెప్పారు. విశాఖ ఉక్కును రక్షించుకునేందుకు చేస్తున్న ఉద్యమానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు ఇస్తామని, తెలుగువారి హక్కును వదులుకునేందుకు ఏమాత్రం సిద్ధంగా లేమని వారంతా ఘంటాపథంగా చెబుతున్నారు. 


విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సమర్ధిస్తారా..? అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన ఒపీనియన్ పోల్‌కు అనూహ్యమైన ప్రజాస్పందన వచ్చింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని 85% మంది ప్రజానీకం చెప్పింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సమర్ధిస్తామని 15% మంది చెప్పారు. 


విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చేయాలన్న బీజేపీ ఆలోచన వెనుక వైసీపీ ప్రమేయం ఉందని ఏపీలోని ప్రతిపక్షాలు, ప్రజా, ఉద్యోగ సంఘాలు కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. ఇదంతా జగన్ సర్కారుకు తెలిసే జరుగుతున్న ప్రహసనంగా నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. ఇదే అంశాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రజల ముందు వుంచినప్పుడు వైసీపీ సర్కార్ ప్రమేయంతోనే కేంద్రం ఇంత దుస్సాహసానికి ఒడిగట్టిందని 81% మంది ప్రజలు దుయ్యబట్టారు. 19% మంది మాత్రం వైసీపీ ప్రమేయం ఉండకపోవచ్చునని చెప్పారు. 


విశాఖ ఉక్కును రక్షించుకునేందుకు చేస్తున్న ఉద్యమానికి మద్దతిస్తున్నారా..? అని అడిగిన ప్రశ్నకు 87% మంది ప్రజానీకం మద్దతు ఇస్తామని చెప్పడం విశేషం. కేవలం 13%మంది మాత్రమే మద్ధతు ఇవ్వడం లేదని చెప్పారు. విశాఖ ఉక్కు .. ఆనాడు ఎలాగైతే ఆంధ్రుల హక్కు అనే నినాదమై ఉద్యమంగా మారి ఎగసిపడిందో ఇప్పుడు కూడా అటువంటి పోరాట స్ఫూర్తే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఈ అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిజిటల్, ప్రింట్, టెలివిజన్ మీడియా ద్వారా విస్తృతస్థాయిలో ఒపీనియన్ పోల్ నిర్వహించింది.

Updated Date - 2021-02-26T00:59:32+05:30 IST