ABN Poll Result: క్రిస్టియానో రొనాల్డోకే మద్దతు

ABN , First Publish Date - 2021-07-22T23:56:08+05:30 IST

కూల్స్ డ్రింక్స్‌పై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొంతమంది వాటిని తాగకుండా ఉండలేరు. కొంతమంది ఆరోగ్యం గురించి ఆలోచించి వాటికి దూరంగా ఉంటారు.

ABN Poll Result: క్రిస్టియానో రొనాల్డోకే మద్దతు

ఇంటర్నెట్ డెస్క్: కూల్స్ డ్రింక్స్‌పై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొంతమంది వాటిని తాగకుండా ఉండలేరు. కొంతమంది ఆరోగ్యం గురించి ఆలోచించి వాటికి దూరంగా ఉంటారు. అయితే ఇటీవల ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఓ ప్రెస్‌మీట్‌లో కూల్ డ్రింక్ బాటిల్‌ను పక్కకు తోసేసి మరీ మంచినీళ్ల బాటిల్ అందుకున్నారు. మీడియా ముందే ఇలా జరగడంతో అందరూ షాకయ్యారు. రొనాల్డో రియల్ హీరో అంటూ కొంతమంది మెచ్చుకున్నారు కూడా. అయితే మన అథ్లెట్స్ కొంత మంది థమ్సప్ యాడ్ చేస్తూ ప్రమోట్ చేస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ‘మీ దృష్టిలో ఎవరు హీరోలు? అంటూ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. థమ్సప్ యాడ్ చేసిన మన ఇండియన్ అథ్లెట్స్ రియల్ హీరోలా?.. కూల్ డ్రింక్ బాటిల్స్ పక్కకు తోసి మంచినీళ్లు తాగిన క్రిస్టియానో రొనాల్డోనా? అంటూ ఆప్షన్స్ ఇచ్చింది. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. అత్యధికంగా 93 శాతం మంది క్రిస్టియానోనే రియల్ హీరో అంటూ తమ స్పందనను తెలియజేయగా, కేవలం 7 శాతం మందే థమ్సప్ యాడ్ చేసిన మన ఇండియన్ అథ్లెట్స్ హీరోలు అంటూ మద్దతిచ్చారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన ఈ ఒపీనియన్ పోల్‌లో క్రిస్టియానో అసలైన హీరోగా నిలిచారు.

Updated Date - 2021-07-22T23:56:08+05:30 IST