Advertisement
Advertisement
Abn logo
Advertisement

మండల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి

గన్నవరం, డిసెంబరు 3: మండల అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ అనగాని రవి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందించేం దుకు గ్రామ స్థాయిలో సర్పంచ్‌, ఎంపీటీసీలు దృష్టి సారించాలన్నారు. ఎంపీటీసీలకు ప్రత్యేకంగా విధులు లేవని అధైర్య పడవద్దని చెప్పారు. గ్రామాల్లో ఎటు వంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. రానున్న రోజుల్లో గ్రామీణ రహదారులను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు, నివేశన స్థలాలు అందేలా చూడాలన్నారు. ఎంపీపీ రవి మాట్లాడుతూ మండల పరిషత్‌ ఆదాయ వనరులను పెంచే దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జడ్పీటీసీ సభ్యురాలు అన్న వరపు ఎలిజబెత్‌ రాణి కేసరపల్లి, సూరంపల్లి జడ్పీహైస్కూళ్లకు క్రీడా ప్రాంగణాలకు అవసరమైన స్థలాలను కేటాయిం చాలని కోరారు. సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ శాఖల పని తీరుపై సమీక్ష నిర్వహించారు. వైస్‌ ఎంపీపీ కొమ్మరాజు సుధీర్‌, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ గౌసాని ఎంపీడీవో వై.సుభాషిణి, ఎంఈవో ఆదూరి వెంకటరత్నం పాల్గొన్నారు. 

Advertisement
Advertisement