కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ తిరుగులేని విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ బీజేపీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నిజం చెప్పాలంటే ఇది టపాసులు లేని దీపావళి అని సెటైర్ వేశారు. ఉప ఎన్నికలు జరిగిన దిన్హాటా, గోసాబా, ఖార్దాహా, శాంతిపూర్ స్థానాలు నాలుగింటినీ టీఎంసీ గెలుచుకుంది. దిన్హాటా, శాంతిపూర్ స్థానాలను బీజేపీ చేతి నుంచి లాగేసుకున్న టీఎంసీ మొత్తం స్థానాలను 213కు పెంచుకుంది.