హలో బ్రదర్... అక్కడ ఉంది.. మా నాన్న, అశోక్ చవాన్ : అభిషేక్ బచ్చన్

ABN , First Publish Date - 2020-09-20T19:13:10+05:30 IST

‘తొందర పడకూ సుందర వదనా’ అన్న సూక్తి ఊరికే రాలేదు. సామాజిక మాధ్యమాలు క్రియాశీలకంగా మారిన తర్వాత ఈ సూక్తి

హలో బ్రదర్... అక్కడ ఉంది.. మా నాన్న, అశోక్ చవాన్ : అభిషేక్ బచ్చన్

ముంబై : ‘తొందర పడకూ సుందర వదనా’ అన్న సూక్తి ఊరికే రాలేదు. సామాజిక మాధ్యమాలు క్రియాశీలకంగా మారిన తర్వాత ఈ సూక్తి మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. పూర్తిగా చదవకుండా, పూర్తిగా ఫొటోలను పరికించకుండా కామెంట్లు చేసేయడం అలవాటుగా మారింది. అచ్చు ఇలాంటి ఘటనే ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్‌కి ఎదురైంది. బిగ్ బీ అమితాబ్ ఓసారి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌తో ఫొటో దిగారు. దీనిని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి ఈ ఫొటోను పూర్తిగా పరికించడకుండా అభిషేక్ బచ్చన్ కు ట్వీట్ చేశారు.


ట్వీట్ చేయడమే కాకుండా... ఏకంగా తప్పుడు పదాలను కూడా వాడాడు. ‘‘బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీంతో చూడవచ్చు’’ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో అలర్ట్ అయిన అభిషేక్... ‘‘బ్రదర్... ఈ ఫొటోలో మా నాన్నతో పాటు ఉన్నవారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్’’ అంటూ బదులిచ్చారు. దీంతో ఆ వ్యక్తి ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై అమితాబ్ భార్య, ఎంపీ జయాబచ్చన్ స్పందించారు. సినిమా ఇండస్ట్రీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. 

Updated Date - 2020-09-20T19:13:10+05:30 IST